Unlimited Data Plans : అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించాలనుకుంటే.. ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్ బెటర్
Unlimited Data Plan : రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ రెండూ అనేక ప్లాన్లతో అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అటువంటి ప్లాన్స్ జాబితాను చెక్ చేయండి. దీనితో మీరు మీ బడ్జెట్ ప్రకారం సరైనదాన్ని ఎంచుకోవచ్చు.

అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని భారత టెలికాం మార్కెట్లో అతిపెద్ద కంపెనీలైన జియో, ఎయిర్టెల్ అందిస్తున్నాయి. ఇప్పుడు మీరు కూడా అన్‌లిమిటెడ్ 5జీని ఆస్వాదించాలనుకుంటే సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఎక్కువ లేదా తక్కువ వాలిడిటీ ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్ చేయవచ్చు. రెండు ఆపరేటర్లు ఇలాంటి ప్లాన్స్ అందిస్తున్నాయి. అపరిమిత 5జీ డేటా ప్లాన్ల జాబితాను చూడండి..
ఎయిర్‌టెల్
28 రోజుల వ్యాలిడిటీతో రూ.349 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. అదే సమయంలో ఎయిర్టెల్ వినియోగదారుల చౌకైన 5జీ ప్లాన్ రూ .379, ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. తక్కువ ధరకే అపరిమిత 5జీని ఆస్వాదించాలనుకుంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ.629 ప్లాన్‌తో 56 రోజుల వ్యాలిడిటీ రూ.719 ప్లాన్‌తో 70 రోజుల పాటు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ 4జీ యూజర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తున్నాయి. ఎయిర్టెల్ వినియోగదారలుకు రూ.649 ప్లాన్‌తో 56 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవచ్చు.
జియో
జియో వినియోగదారులు రూ.999 ప్లాన్‌తో 98 రోజుల వాలిడిటీని పొందుతున్నారు. ఎయిర్టెల్ వినియోగదారులు రూ .979తో అపరిమిత 5జీ ప్రయోజనాన్ని పొందుతారు, అయితే ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లు 4జీ యూజర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తున్నాయి.
అన్‌లిమిటెడ్ 5జీతో బెస్ట్ యాన్యువల్ ప్లాన్
ఏడాది పొడవునా అపరిమిత డేటా ప్రయోజనం పొందాలంటే ఎయిర్టెల్ యూజర్లు రూ.3,599 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా జియో ప్లాన్ కూడా రూ .3,599గా ఉంది. వ్యత్యాసం ఏమిటంటే 4జీ వినియోగదారులు ఎయిర్టెల్ ప్లాన్‌లో 2 జీబీ రోజువారీ డేటాను పొందుతారు. జియో వినియోగదారులు ఏడాది పొడవునా ప్లాన్‌లో 2.5 జీబీ రోజువారీ డేటాను పొందుతారు.
అర్హులైన వినియోగదారులు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని అందించే చౌకైన, సరసమైన ప్లాన్ల గురించి సమాచారం ఇంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్ని నెట్‌వర్కలో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.