Samsung Galaxy M35 : రూ. 25వేల​లోపు స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఈ ఫీచర్ ​లోడెడ్​ శాంసంగ్​ ఫోన్​ బెస్ట్​!-best smartphone under 25000 checkout samsung galaxy m35 5g price and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy M35 : రూ. 25వేల​లోపు స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఈ ఫీచర్ ​లోడెడ్​ శాంసంగ్​ ఫోన్​ బెస్ట్​!

Samsung Galaxy M35 : రూ. 25వేల​లోపు స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఈ ఫీచర్ ​లోడెడ్​ శాంసంగ్​ ఫోన్​ బెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Feb 03, 2025 01:43 PM IST

మెరుగైన పనితీరు, ఫీచర్లను అందిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం35 రూ. 25వేలలోపు బడ్జెట్​ ఉన్న వారికి మంచి ఆప్షన్​ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్లు, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ టెక్​ చేయండి.

ఈ ఫీచర్ ​లోడెడ్​ శాంసంగ్​ ఫోన్​ బెస్ట్​!
ఈ ఫీచర్ ​లోడెడ్​ శాంసంగ్​ ఫోన్​ బెస్ట్​! (Samsung)

ఇండియన్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో రూ. 25వేల ధరలోపు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. వీటిల్లో ఏది ఏంచుకోవాలి? అని సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి మీరు కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రూ. 25వేల బడ్జెట్​లోపు ఫోన్​ చూస్తున్నారా? అయితే మీరు శాంసంగ్​ గెలాక్సీ ఎం35 గురించి తెలుసుకోవాల్సిందే

yearly horoscope entry point

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ- ఫీచర్లు..

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీలో 6.6 ఇంచ్​ ఎఫ్​హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-ఓ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్​ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను యూజర్లు ఎంచుకోవచ్చు. శాంసంగ్ ఎం35 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 డిస్​ప్లేతో పనిచేస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

కనెక్టివిటీ కోసం శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయెల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6 (802.11), బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ వంటివి ఉన్నాయి.

50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను శాంసంగ్​ ఇచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ- ధర..

అమెజాన్​లో శాంసంగ్​ గెలాక్సీ ఎం35 5జీ ధరలు..

6జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ - రూ. 16,999

8జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ - రూ. 18,499

8జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్​ - రూ. 21,499

వీటిపై అమెజాన్​లో ఆఫర్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే, శాంసంగ్​ గెలాక్సీ ఎం35 5జీ ధర మరింత తగ్గుతుంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం గురించి లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుసుకునేందుకు హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం