Best smartphone under 15000 : రూ. 15వేల బడ్జెట్లో వివో కొత్త స్మార్ట్‌ఫోన్- సూపర్ అంతే!
Vivo Y29 5G price : వై29 5జీ పేరుతో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొచ్చింది వివో సంస్థ. ఈ గ్యాడ్జెట్ ఎలా ఉంది? కొనొచ్చా? ఫీచర్స్ ఏంటి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
రూ. 15వేల బడ్జెట్లోపు ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. వై29 5జీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని వివో సంస్థ భారతీయులకు తాజాగా పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై29 5జీ- ఫీచర్లు..
వివో వై29 5జీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.68 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఎస్జీఎస్ సర్టిఫికేషన్ లభించింది. ఇది దాని మిలిటరీ-గ్రేడ్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్‌ని సూచిస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 300% వాల్యూమ్ బూస్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది స్పష్టమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
వివో వై29 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఏఐ నైట్ మోడ్, సీన్ మోడ్స్, ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ ఎరేజ్ వంటి పలు ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లను ఇందులో అందిస్తోంది దిగ్గజ సంస్థ వివో. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చింది. ఇది 19.7 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
ఈ వివో వై29 5జీ బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసే వారిని ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో వై29 పనిచేస్తుంది.
వివో వై29 5జీ- ధర..
వివో వై29 5జీ 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది: గ్లేసియర్ బ్లూ, టైటానియం గోల్డ్, డైమండ్ బ్లాక్. 4జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించింది సంస్థ. 6 జీబీ/128 జీబీ, 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వరుసగా రూ.15,499, రూ.16,999, రూ.18,999 ధరకు లభిస్తున్నాయి. వివో వై29 5జీ వివో ఆన్లై స్టోర్ నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
వివో ఎక్స్200 ప్రోని చెక్ చేశారా..?
వివో ఎక్స్200 సిరీస్‌ని ఈ నెల 12న లాంచ్ చేసింది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. ఇందులో వివో ఎక్స్200, ఎక్స్200 ప్రో గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రో200 మోడల్‌కి కస్టమర్స్ నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలతో పాటు ఎక్స్100 ప్రోతో పోల్చి చూస్తే ఏది బెస్ట్? అన్నది తెలుసుకనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం