Waterproof Mobile phones : ఈ ఫోన్‌లు నీటిలో తడిసినా ఏం కాదు.. వర్షంలోనూ ఎంచక్కా వాడేయెుచ్చు!-best smart phones with ip68 and ip69 water resistant rating in india know waterproof mobile phones list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Waterproof Mobile Phones : ఈ ఫోన్‌లు నీటిలో తడిసినా ఏం కాదు.. వర్షంలోనూ ఎంచక్కా వాడేయెుచ్చు!

Waterproof Mobile phones : ఈ ఫోన్‌లు నీటిలో తడిసినా ఏం కాదు.. వర్షంలోనూ ఎంచక్కా వాడేయెుచ్చు!

Anand Sai HT Telugu

Best Smart Phones In Telugu : వానాకాలంలో ఫోన్లతో చాలా ఇబ్బందే. ఎందుకంటే నీటిలో తడిసిపోతే మళ్లీ పని చేసేందుకు వాటితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే ఎవరైనా కొత్తగా ఫోన్ కొనాలి అనుకుంటే.. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్లపై ఓ లుక్కేయండి..

వాటర్ ప్రూఫ్ ఫోన్స్

కొత్తగా ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఐపీ 68, ఐపీ 69 రేటింగ్స్ ఉన్న వాటర్ రెసిస్టెంట్ ఫోన్లు ఈ సీజన్లో మీకు ఉత్తమంగా ఉంటాయి. ఈ ఫోన్లు వాటర్ ప్రూఫ్ అంటే.. వాటిని వర్షంలో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఎలాంటి సమస్య రాదు.

నిజానికి వర్షాకాలంలో ఫోన్ నీళ్లతో తడిసిపోతే పెద్ద సమస్యే. సాధారణంగా తడి ఫోన్ లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ వద్ద వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఉంటే మీరు వర్షంలోనూ ఫోన్ తీసి వాడుకోవచ్చు. వర్షాకాలానికి మాత్రమే ఈ ఫోన్లు బెస్ట్ అని చెప్పడం లేదు. అన్ని కాలాల్లోనూ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో బలమైన డిస్ప్లే, 200 మెగాపిక్సెల్ వరకు కెమెరా సెటప్, మంచి ప్రాసెసర్ కూడా ఉంటుంది. మార్కెట్లో ఉన్న కొన్ని బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

రెడ్ మీ నోట్ 13 ప్రో +

రెడ్ మీకి చెందిన ఈ ఫోన్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నారు. ప్రాసెసర్ గా ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్ సెట్ ఉంది. 1.5కే రిజల్యూషన్ తో 6.67 అంగుళాల కర్వ్ డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఫోన్ వెనుక ప్యానెల్ వెజిటేరియన్ లెదర్ డిజైన్ తో ఉంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో సహా ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఈ ఫోన్‌వో ఉన్నాయి. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ గా ఉంది. ఈ ఫోన్ ధర రూ.30,999.

ఒప్పో ఎఫ్ 27 ప్రో +

రూ .27,999తో ఐపీ 69 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్‌లో ఇచ్చిన ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే 6.7 అంగుళాలు. దీని ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో

ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్. ధర రూ.29,999. ఈ ఫోన్ ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 6.7 అంగుళాల డిస్ ప్లే, 1.5కే రిజల్యూషన్ ను అందించనున్నారు. ఈ పాంటోన్ వాలిడేటెడ్ డిస్ప్లే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 10 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. మోటరోలాకు చెందిన ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ 4500 ఎంఏహెచ్ గా అందిస్తున్నారు.