Hyundai Creta : బెస్ట్ సెల్లింగ్ హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు, ధరలు.. ఓ లుక్కేయండి
Hyundai Creta : హ్యుందాయ్ క్రెటాకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. జనవరిలో మంచి అమ్మకాలు చేసింది. ఈ కారు గురించి వివరాలు తెలుసుకుందాం..

దేశంలో ఆటో పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు సైతం కొత్త కొత్త బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. చాలా విదేశీ కారు బ్రాండ్లు స్థానికంగా తయారీ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. మంచి అమ్మకాలను చేస్తున్నాయి. క్రెటా హ్యుందాయ్‌ను నేడు భారతదేశంలో అగ్రగామి కంపెనీగా నిలిపింది. జనవరి 2025లో ఎస్‌యూవీ అమ్మకాల్లో దుమ్మురేపింది.
హ్యుందాయ్ క్రెటా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ముఖ్యమైన కారుగా ఉంది. ఇది బెస్ట్ సెల్లింగ్ వాహనాలలో స్థిరంగా తన స్థానాన్ని నిలుపుకొంది. జనవరి 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. హ్యుందాయ్ క్రెటా 18,522 యూనిట్ల అమ్మకాలతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో అరంగేట్రం చేసినప్పటి నుండి జనవరి 2025లో ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ కారుకు అంత డిమాండ్ ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కస్టమర్ల డిమాండ్లను తీర్చడానికి, ప్రత్యర్థి కార్ల నుండి పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీ కొత్త అప్‌డేట్‌లతో కొత్త 2024 క్రెటాను ప్రారంభించింది.
వేరియంట్లు
కొత్త హ్యుందాయ్ క్రెటా పలు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ)లో ఉన్నాయి. ఈ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 పీఎస్ పవర్, 144ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160పీఎస్ పవర్, 253ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ పరంగా చూస్తే.. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఉన్నాయి. వెనుక సీటు 2-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్, అప్‌స్కేల్ ప్యాకేజీతో, కొత్త హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ సౌకర్యం, సౌలభ్యం కోసం క్యాబిన్‌లో తగినంత స్థలాన్ని అందిస్తుంది.
క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ ఏసీతో పాటు అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్(ADAS) తో కూడా అమర్చబడి ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బాస్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ధరలు
హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.11 లక్షల నుంచి మెుదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.20.42 వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
టాపిక్