Best electric car : ఈ టాటా ఫ్యామిలీ ఈవీకి క్రేజీ డిమాండ్​- ఆ మైలురాయిని దాటేసింది..!-best selling electric car tata tiago ev sales cross the 50 000 milestone since launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Car : ఈ టాటా ఫ్యామిలీ ఈవీకి క్రేజీ డిమాండ్​- ఆ మైలురాయిని దాటేసింది..!

Best electric car : ఈ టాటా ఫ్యామిలీ ఈవీకి క్రేజీ డిమాండ్​- ఆ మైలురాయిని దాటేసింది..!

Sharath Chitturi HT Telugu

టాటా టియాగో ఈవీ మేజర్​ మైల్​స్టోన్​ని హిట్​ చేసింది. లాంచ్​ టైమ్​ నుంచి ఇప్పటివరకు ఈ బెస్ట్​ సెల్లింగ్​, ఫ్యామిలీ ఈవీ ఎన్ని యూనిట్స్​ని విక్రయించిందంటే..

టాటా టియాగో ఈవీ

ఇండియా ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ రారాజుగా కొనసాగుతోంది. ఈ సంస్థ నుంచి వచ్చే ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. మరీ ముఖ్యంగా ఎంట్రీ లేవల్​ వెహికిల్​ అయిన టాటా టియాగో ఈవీకి క్రేజీ డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్ట్రిక్​ కారు ఇప్పుడొక కీలక మైలురాయిన దాటింది! టటా టియాగో ఈవీ 50,000 అమ్మకాల మైలురాయిని అధిగమించినట్టు సంస్థ తాజాగా వెల్లడించింది. టియాగో ఈవీకి మాత్రమే కాకుండా దేశంలో అభివృద్ధి దశలో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్​కు కూడా ఈ సేల్స్ నెంబర్ ఒక మైలురాయని చెప్పుకోవచ్చు. 

టాటా టియాగో ఈవీ సేల్స్ మైలురాయి..

టాటా టియాగో ఈవీని మొదట సెప్టెంబర్ 2022లో ఆవిష్కరించింది సంస్థ. అమ్మకాలు ఫిబ్రవరి 2023లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత, అంటే మే 2023లో టాటా టియాగో ఈవీ 10,000 యూనిట్ల అమ్మకాల మార్కును తాకింది. గత 17 నెలల్లో 40,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్​బ్యాక్ విడుదల సమయంలో భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ అయిన ఈవీగా నిలిచింది. కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ వచ్చాయి. ఈ సంఖ్యను ఇటీవల ఎంజీ విండ్సర్ ఈవీ అధిగమించింది! ఇది 24 గంటల్లోనే విండోలో 15,000 పరిమితిని దాటింది.

టాటా టియాగో ఈవీకి గట్టి పోటీనే ఉన్నప్పటికీ సేల్స్​ పరంగా పెద్ద ప్రభావం పడలేదు. ఎంజీ కామెట్, సిట్రోయెన్ ఈసీ3 వచ్చినప్పటికీ టాటా టియాగో ఈవి దూసుకెళుతోంది. నాలుగు-డోర్ల ప్రాక్టికాలిటీ, ఉపయోగించదగిన బూట్ స్పేస్​, మంచి శ్రేణి వంటివి.. కొనుగోలుదారులు టియాగో ఈవీని ఎంచుకోవడానికి బలమైన కారణాలు.

టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్​లతో లభిస్తుంది. లోయర్ వేరియంట్లలో 19.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. పెద్ద 24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులోని 55 కిలోవాట్ల (74 బీహెచ్​పీ) పీఎమ్ఎస్ ఎలక్ట్రిక్ మోటార్ 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. టియాగో ఈవీ ధర రూ .7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

టాటా టియాగో ఈవీ ఫెస్టివల్ ఆఫర్లు..

టాటా మోటార్స్ పండుగ సీజన్ కోసం టియాగో ఈవీపై అనేక డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.6,499 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐలతో 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్​ని అందిస్తోంది. కార్పొరేట్ కస్టమర్లు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేకాకుండా 5,600కి పైగా టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలల ఉచిత ఛార్జింగ్​తో ఇంధన ఖర్చులపై రూ .75,000 వరకు మీరు ఆదా చేసుకునే ఆఫర్​ని కూడా ఇచ్చింది.

మరి మీరు టాటా టియాగో ఈవీని కొంటున్నారా? లేక మీకు ఏ ఎలక్ట్రిక్​ కారు అంటే ఇష్టం?

సంబంధిత కథనం