బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కార్లు.. ఈ లిస్టులో మీకు నచ్చేది ఉందా? బడ్జెట్ ధరనే!-best selling 7 seater cars for middle class family renault triber to mahindra bolero know budget ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కార్లు.. ఈ లిస్టులో మీకు నచ్చేది ఉందా? బడ్జెట్ ధరనే!

బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కార్లు.. ఈ లిస్టులో మీకు నచ్చేది ఉందా? బడ్జెట్ ధరనే!

Anand Sai HT Telugu

Best 7 Seater Cars : ఫ్యామిలీ పెద్దగా ఉండేవారు ఎక్కువగా 7 సీటర్ కార్లవైపు మెుగ్గుచూపుతారు. బడ్జెట్ ధరలో వచ్చే వాటి కోసం చూస్తారు. ఈ లిస్టులో మీకు నచ్చే 7 సీటర్ ఉందో చూడండి.

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో 7-సీటర్ కార్లను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. భారతదేశంలో సరమైన ధరలో కొన్ని 7 సీటర్ కార్లు ఉన్నాయి. అందులో రెనాల్ట్ ట్రైబర్, మారుతి, మహీంద్రా బ్రాండ్లు కూడా మంచి 7 సీట్ల కార్లను అందిస్తున్నాయి. ధర పెరిగే కొద్దీ ఫీచర్లు పెరుగుతాయి. భారతదేశంలో అందుబాటు ధరలో ఉన్న బెటర్ 7 సీటర్ కార్ల గురించి చూద్దాం..

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్ సరసమైన 7 సీటర్ కారు. దీని బేస్ వేరియంట్ ధర రూ. నుండి రూ. 5.99 లక్షల నుండి టాప్ వేరియంట్ ధర రూ.8.97 లక్షలు(ఎక్స్-షోరూమ్). దీనికి ఆర్‌ఎక్స్‌ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టీ లాంటి వేరియంట్లు ఉన్నాయి. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కూల్డ్ స్టోరేజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

దీనికి 4 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, టీసీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, టీపీఎంఎస్, ఈఎస్‌పీ, హెచ్‌ఎస్‌ఏ, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 72 పీఎస్ శక్తిని, 96ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 18.2 నుండి 20 కి.మీ. మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. మారుతి ఎర్టిగా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ ఎంటీ లేదా 6-స్పీడ్ ఏటీకి జతచేసి ఉంటుంది. సీఎన్జీతో నడిచేటప్పుడు ఈ ఇంజిన్ ప్రత్యేకంగా 5-స్పీడ్ ఎంటీతో లభిస్తుంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్‌తో ఉంటాయి.

కియా కారెన్స్

కియా 7 సీటర్ విభాగంలో కారెన్స్‌ను అందిస్తుంది. దీని బేస్ వేరియంట్ ప్రీమియం ప్లస్ ప్రారంభ ధర రూ. 10.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). కియా కారెన్స్ ప్రస్తుతం 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది, అన్ని వేరియంట్లలో ధరలు పెరుగుతున్నాయి. ఇది సన్‌రూఫ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. కియా కారెన్స్‌ను 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తుంది. ఇది 158బీహెచ్‌పీ, 260ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 బీహెచ్‌పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ 115 బీహెచ్‌పీ పవర్, 144 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో బేస్ వేరియంట్ ధర 9.79 లక్షలు. ఇది మూడు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. మహీంద్రా బొలెరో నియో మరొక వెర్షన్. మహీంద్రా బొలెరో 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 75 బీహెచ్‌పీ శక్తిని, 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా బొలెరో నియో ఎంపీవీ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 98 బీహెచ్‌పీ శక్తిని, 260ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది.

Anand Sai

eMail