Scooters : ఈ స్కూటీలు చాలా మందికి ఇష్టం.. తక్కువ ధరతో మంచి మైలేజీ!-best scooter with good mileage in budget price check tvs scooty zest honda activa 6g and other 110 cc scooty price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Scooters : ఈ స్కూటీలు చాలా మందికి ఇష్టం.. తక్కువ ధరతో మంచి మైలేజీ!

Scooters : ఈ స్కూటీలు చాలా మందికి ఇష్టం.. తక్కువ ధరతో మంచి మైలేజీ!

Anand Sai HT Telugu
Aug 20, 2024 02:00 PM IST

Best Scooters : ఈ మధ్యకాలంలో స్కూటీల వాడకం ఎక్కువైంది. చాలా మంది స్కూటర్‌లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని ప్రజాదరణ పొందిన స్కూటీలు ఉన్నాయి. అవి ఏంటో.. వాటి ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

టీవీఎస్ జెస్ట్
టీవీఎస్ జెస్ట్ (Hindustan times)

స్కూటర్‌లు కూడా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. స్కూటర్ రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు ఇద్దరూ సులభంగా వాడుకోవచ్చు. దేశీయ మార్కెట్‌లో 110, 125 సీసీ ఇంజన్లతో కూడిన స్కూటర్లకు మంచి ఆదరణ ఉంది. మీరు బడ్జెట్ ధరలో కొత్త స్కూటర్‌ని పొందాలని చూస్తే.. 110సీసీ స్కూటర్లను ఎంచుకోవచ్చు. ఇవి 125 సీసీ ఇంజన్‌తో కూడిన స్కూటర్‌లను పోలి ఉంటాయి. హోండా యాక్టివా 6g, హీరో Xoom, TVS స్కూటీ జెస్ట్‌లాంటి స్కూటర్లు ఎక్కువ మంది కొంటున్నారు. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి, అధిక మైలేజీని అందిస్తాయి. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..

హోండా యాక్టివా 6జీ

హోండా యాక్టివా 6జీ రూ.78,624 నుండి రూ.84,674 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 109.51 cc పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7.79 PS పవర్, 8.84 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త యాక్టివా 6జీ స్కూటర్ 50 kmpl మైలేజీని అందిస్తుంది. డీసెంట్ బ్లూ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ, బ్లాక్, పర్ల్ ప్రెషియస్ వైట్, రెబెల్ రెడ్ మెటాలిక్ వంటి వివిధ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. LED హెడ్‌లైట్, పూర్తి-అనలాగ్ కన్సోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ బరువు 106 కిలోలు.

టీవీఎస్ స్కూటీ జెస్ట్

ఈ స్కూటర్ ధర రూ. 72,614 నుండి రూ. 73,417 (ఎక్స్-షోరూమ్). 7.8 PS గరిష్ట శక్తిని, 8.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 109.7 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ 48 kmpl మైలేజీని అందిస్తుంది. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్ సహా వివిధ రంగుల్లో కూడా దొరుకుతుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా మంచి ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో డ్రమ్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లు ప్రయాణికులకు రక్షణ కల్పిస్తాయి.

హీరో Xoom

స్కూటీ కూడా రూ. 75,761 నుండి రూ. 85,400 ఎక్స్-షోరూమ్ ధర దొరుకుతుంది. 110.9 సీసీ, ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 8.15 PS గరిష్ట శక్తిని, 8.70 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ 45 kmpl మైలేజీని ఇస్తుంది. పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం వేరియంట్‌లను బట్టి డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌ల ఎంపిక ఉంది.