Best Samsung phones: సేల్ లో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ సామ్సంగ్ ఫోన్స్
Best Samsung phones: భారతీయులు విశ్వసించే స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో సామ్సంగ్ (Samsung) ఒకటి. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ కొత్త మోడల్స్ ను సామ్సంగ్ విడుదల చేస్తుంటుంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో ఈ సామ్సంగ్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. చెక్ చేయండి..
Best Samsung phones: అందుబాటు ధరలో, అత్యంత నాణ్యతతో, అన్ని అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్ ను సామ్సంగ్ అందిస్తుంటుంది. ప్రస్తుతం ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సైట్స్ లో సేల్ కొనసాగుతోంది. వాటిలో లభిస్తున్న బెస్ట్ సామ్సంగ్ ఫోన్స్ ఇవి.
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy S22 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా
ఇది సామ్సంగ్ 2022 ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra). ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఆమెజాన్ లో రూ. 97999. అలాగే, రూ. 5 వేల వరకు బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్, రూ. 29150 వరకు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తాయి. ఇందులో 8 కే రికార్డింగ్, ఎస్ పెన్ (S Pen) అన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.
Samsung Galaxy S21 FE: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ
సేల్ లో ఈ సామ్సంగ్ ప్రీమియం ఫోన్ కూడా భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో రూ. 31999 లకే ఈ ఫోన్ లభిస్తుంది. రూ. 2 వేల వరకు బ్యాంక్ ఆఫర్స్, రూ. 27250 వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ అదనం. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 74999.
Samsung Galaxy A34: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34
ఇది గెలాక్సీ సిరీస్ లో లేటెస్ట్ ఫోన్. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధరను రూ. 30999 గా నిర్ణయించారు. కానీ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 27999 లకు లభిస్తుంది. అలాగే, సామ్సంగ్ గెలాక్సీ ఏ 23 (Samsung Galaxy A23) కూడా సేల్ లో మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ Samsung Galaxy A23 ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఈ ఫోన్ లిస్టెడ్ ప్రైస్ రూ 23990 కాగా, ప్రస్తుతం సేల్ లో రూ. 17499 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ చేంజ్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది. ఇందులో 6.6 ఇంచ్ ల ఎఫ్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 50 ఎంపీ క్వాడ్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ ఉన్నాయి.