Mutual Funds : 2025లో పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్!-best mutual funds to invest in 2025 for good returns check small mid and large cap mutual funds here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Funds : 2025లో పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్!

Mutual Funds : 2025లో పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్!

Anand Sai HT Telugu
Jan 06, 2025 07:30 PM IST

Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. కానీ మీరు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారనే క్యాలిక్యులేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే రాబడులు వస్తాయి.

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి
మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి

మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ మధ్య కాలంలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. నిజానికి యువత కూడా వీటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం మంచి రాబడులు రావడమే. కానీ పెట్టుబడి పెట్టేముందు మీరు మీ టార్గెట్ సెలక్ట్ చేసుకోవాలి. సరైన పథకాన్ని ఎంచుకోవాలి. అప్పుడే రాబడులు భారీగా ఉంటాయి. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని గతంలో మంచి రాబడిని ఇచ్చాయి.  2025లో ఏయే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో నిపుణులు చెబుతున్నారు.

yearly horoscope entry point

1.స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

కొన్ని స్థిరంగా బెంచ్‌మార్క్ రాబడిని అధిగమించడం ద్వారా ఆల్ఫా లాభాలను తెచ్చాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం BSE 250 స్మాల్‌క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (22.03 శాతం), NIFTY స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (22.65శాతం) సెట్ చేసిన బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇందులో ముందు వరుసలో ఉన్నవి చూస్తే..

బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 29.37 శాతం, ITI స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)-27.39 శాతం, ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 27.28 శాతం, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 26.85 శాతం, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 26.61 శాతం, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 25.77 శాతం, ఫ్రాంక్లిన్ ఇండియా చిన్న కంపెనీల ఫండ్ (డైరెక్ట్)- 25.72 శాతం, LIC MF స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)- 25.62 శాతం, హెచ్ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్)-24.74 శాతంగా ఉన్నాయి.

2.మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

ఇక ఈ ఏడాది మిడ్‌క్యాప్ సిఫార్సుల గురించి ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అండ్ హెడ్ చేతన్ పలు వివరాలు పంచుకున్నారు. మూడు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి సలహాలు ఇచ్చారు. అవి :

కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ రెగ్యులర్

కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ మిడ్-క్యాప్ కేటగిరీలో టాప్-పెర్ఫార్మింగ్ ఫండ్స్‌లో ఒకటిగా పరిగణిస్తున్నారు. మిడ్ క్యాప్ ఇన్వెస్ట్‌మెంట్ స్పేస్‌లో ఈ ఫండ్ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జనవరి 2024లో అతుల్ భోలే ఫండ్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఫండ్ నిలకడగా అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. కోటక్ ఎమర్జింగ్ ఫండ్ రూ. 53,000 కోట్ల అసెస్ అండర్ మేనేజ్‌మెంట్ కలిగి ఉంది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో ఫండ్ 33.55 శాతాన్ని సాధించింది.

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ AUM సుమారు రూ. 6,000 కోట్లు. ఇది 2024 క్యాలెండర్ సంవత్సరంలో 43.15 శాతం రాబడిని అందించింది. మిడ్-క్యాప్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఆదాయాల వృద్ధి వచ్చే ఏడాదిలో 4 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ గత క్యాలెండర్ ఇయర్‌లో మంచి రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఫండ్‌కు రూ.26,000 కోట్ల AUM ఉంది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో 57.13 శాతం రాబడిని అందించింది. మిడ్‌క్యాప్ బెంచ్‌మార్క్‌ను 11 శాతం అధిగమిస్తుందని అంచనా.

3.లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

మీరు లార్జ్ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గత పనితీరు ఆధారంగా మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. గ్రో.ఇన్ ప్రకారం టాప్ మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ 22 FOF ఫండ్ గత మూడు సంవత్సరాలలో 33.87 శాతం వార్షిక రాబడిని, 5 సంవత్సరాలలో 25.46 శాతం ఇచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ 22 FOF ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం రూ.5,000. సిప్ అయితే రూ.1,000. ఈ మెుత్తాన్ని మీరు పెంచుకోవచ్చు.

నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్

నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడు సంవత్సరాలలో 21.31 శాతం వార్షిక రాబడిని, గత 5 సంవత్సరాలలో 20.46 శాతం ఇచ్చింది. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ కేటగిరీ కింద వస్తుంది. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం రూ.100, SIP ద్వారా రూ.100.

క్వాంట్ ఫోకస్డ్ ఫండ్

క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ గత మూడేళ్లలో 18.69 శాతం వార్షిక రాబడిని, 5 సంవత్సరాల్లో 23.94 శాతాన్ని ఇచ్చింది. క్వాంట్ ఫోకస్డ్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం రూ.5,000, సిప్ ద్వారా రూ.1,000.

ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ గత మూడు సంవత్సరాలలో 17.46 శాతం వార్షిక రాబడిని, 5 సంవత్సరాలలో 19.41 శాతం ఇచ్చింది. ఇందులో ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం రూ.100, సిప్ ద్వారా రూ.100.

JM లార్జ్ క్యాప్ ఫండ్

JM లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడు సంవత్సరాలలో 16.47 శాతం వార్షిక రాబడిని, 5 సంవత్సరాలలో 18.86 శాతం ఇచ్చింది. JM లార్జ్ క్యాప్ ఫండ్ JM ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1,000, సిప్ ద్వారా రూ.100 ఇన్వెస్ట్ చేయవచ్చు.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. నిపుణు అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. మీ దగ్గరలోని నిపుణులతో ఓసారి మాట్లాడి ఇన్వెస్ట్ చేసుకోవాలి.

Whats_app_banner