స్టూడెంట్స్‌కి ఈ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్! నెలకు రూ. 1000 సిప్ చేసినా కోట్లల్లో రిటర్నులు..
Best mutual funds for students : మీరు విద్యార్థి దశలో ఉన్నారా? పాకెట్ మనీ, ఫ్రీలాన్స్తో వచ్చిన డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? మరి స్టూడెంట్స్‌కి ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మనం ఎంత సంపాదించామన్నది కాదు.. సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాము అనేది ముఖ్యం! చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నా, 'ఫైనాన్షియల్ ప్లానింగ్' సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటారు. అదే సమయంలో, కొందరు తక్కువ సంపాదిస్తున్నా, సరైన రూల్స్- ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ని పాటించి జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడంని సంపాదించుకుంటున్నారు. అయితే, ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకుంటే చాలా మంచిది! మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి సేవింగ్స్‌తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ ఉంటే.. డబ్బు విషయంలో, ఇతరుల కన్నా చాలా వేగంగా ఫైనాన్షియల్ ఫ్రీడంని సంపాదించుకోవచ్చు. అలా అని, ఉన్న తక్కువ డబ్బులను కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయి. మరి స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
స్టూడెంట్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎంత ఆలస్యంగా మొదలుపెడితే అంత నష్టపోతాము! అదే చిన్న వయస్సు నుంచే ఇన్వెస్ట్మెంట్స్ని అలవాటు చేసుకుంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వండర్స్ క్రియేట్ చేయొచ్చు. పాకెట్ మనీ, ఫ్రీలాన్స్ వంటి వాటి ద్వారా వచ్చే డబ్బుల్లో కొంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే.. భవిష్యత్తులో అద్భుత రిటర్నులు చూస్తారు.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్ లైఫ్‌లో సేవింగ్స్ కన్నా ఖర్చులే ఎక్కువ ఉంటాయి. అందుకే ఉన్న సేవింగ్స్‌ని 'రిస్క్' చేయడం మంచిది కాదు. కాస్త సేఫ్‌గా ఉండే చోట ఇన్వెస్ట్ చేస్తే బెటర్. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. విద్యార్థులు ట్రేడింగ్‌కి, డైరక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అందుకే స్టూడెంట్స్‌కి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్! వీటిల్లోనూ రిస్క్ ఉన్నప్పటికీ.. డైరక్ట్ స్టాక్స్‌తో పోల్చితే అది చాలా చాలా తక్కువ. అంతేకాదు, ఆ రిస్క్‌ని మరింత తగ్గించేందుకు విద్యార్థులు "ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో" పెట్టుబడి పెట్టడం బెటర్.
అసలేంటి ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్?
మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. నిఫ్టీ50, బ్యాంక్ నిప్టీ వంటి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లలో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇవి యాక్టివ్ ఫండ్స్ కావు. ఇవి పాసివ్ ఫండ్స్. ఫలితంగా రిస్క్ తక్కువగా ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి.. లో-రిస్క్ బ్యాంక్ ఎఫ్డీలు!
ఉదాహరణకు నిఫ్టీ50లో 50 స్టాక్స్ ఉంటాయి. ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్సే! వీటిల్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది.. రిస్క్ తక్కువగా ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం.
పైగా ఇండియాలో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ గత కొంతకాలంగా అండర్-పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక ఇటీవలి స్టాక్ మార్కెట్ ఫాల్లో ఇవి మరింత పడ్డాయి. ఫలితంగా, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్కి ఇదే సరైన సమయం అని నిపుణులు చెబుతున్నారు.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ సిప్‌తో కోట్లు..!
స్టాక్ మార్కెట్లో ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సగటున 12శాతం రిటర్నులు ఇచ్చాయి. దీనిని స్టాండర్డ్‌గా పరిగణించి.. నెలకు రూ. 1000 సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్) చేస్తే ఏమవుతుందో ఇక్కడ చూద్దాము..
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు 20ఏళ్ల వయస్సులో నెలకు రూ. 1000 సిప్ ప్రారంభించారనుకుందాము. మీ రిటైర్మెంట్ వయస్సు (60ఏళ్లు) వచ్చేసరికి, అంటే 40ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధిలో 12శాతం రిటర్నుల అంచనాతో మీ పెట్టుబడి మొత్తం వాల్యూ రూ. 1,18,82,420 అవుతుంది.
పదేళ్ల ఆలస్యంగా, అంటే 30ఏళ్ల వయస్సులో మీరు రూ.2వేల ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించినా.. రిటైర్మెంట్ టైమ్‌కి మీరు రూ. కోటి సంపాదించలేరు! 30ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ క్లాల వ్యవధిలో 12శాతం రిటర్నులతో మీ వాల్యూ రూ. 70,59,828 మాత్రమే అవుతుంది!
తక్కువ వయస్సులో ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభిస్తే కలిగే ప్రయోజనం ఇదే! ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు కాదు, వయస్సు ముఖ్యం. ఎంత తక్కువ డబ్బుతో అయినా ప్రారంభించవచ్చు. కానీ తొందరగా స్టార్ట్ చేయాలి.
అదే మీరు 20ఏళ్ల వయస్సులో, ఇండెక్స్ ఫండ్స్‌లో నెలకు రూ. 1000 సిప్ ప్రారంభించి, దానిని ప్రతియేటా 10శాతం పెంచుకుంటూ వేళితే.. 40ఏళ్ల తర్వాత (అంటే మీ రిటైర్మెంట్ సమయానికి) మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత అవుతుందో తెలుసా? రూ. 3,50,44,023!
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రారంభించే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం