Best Mutual Funds : ఏడాదిలో గరిష్ఠంగా 44.48శాతం రిటర్నులు- 2024లో ఈ మ్యూచువల్ ఫండ్స్ టాప్!
Mutual Funds 2024 : 2024 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బాగా రాణించి, అత్యధిక రిటర్నులు ఇచ్చిన టాప్ 5 లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రజల్లో అవగాహన పెరిగి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. సిప్ ద్వారా ఈ 2024లో భారీ స్థాయిలోనే నగుదు ఫండ్ హౌజ్‌లకు చేరింది. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు దాని గత రాబడులను అంచనా వేయడం, అదే కేటగిరీలోని తోటివారితో పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఏడాది కాలంలో అద్భుత ప్రదర్శన చేసిన టాప్ 5 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి.
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..
మనం కింది పట్టికలో చూడగలిగినట్లుగా.. ఐదు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒక సంవత్సరంలో, అంటే 2024 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 శాతానికి పైగా రాబడిని అందించాయి.
డీఎశ్పీ టాప్ 100 ఈక్విటీ ఫండ్ అత్యధికంగా 22.24 శాతం రాబడిని ఇచ్చింది. ఫండ్ పరిమాణం ఆధారంగా చూస్తే, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మొత్తం అసెట్ సైజు 35,779 కోట్లతో 19.75 శాతం వార్షిక రాబడితో అతిపెద్ద ఫండ్‌గా నిలిచింది.
Large cap fund | 1-year-return (%) | AUM ( ₹crore) |
---|---|---|
WhiteOak Capital Large Cap Fund | 21.85 | 684.51 |
Nippon India Large Cap Fund | 19.75 | 35,779.52 |
Invesco India Largecap Fund | 21.00 | 1,319.26 |
Baroda BNP Paribas Large Cap Fund | 21.35 | 2,421.62 |
DSP Top 100 Equity Fund | 22.24 | 4,520.89 |
(ఆధారం: యాంఫీ, డిసెంబర్ 28 నాటికి రాబడులు)
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..
మిడ్ క్యాప్ విభాగంలో 7 మ్యూచువల్ ఫండ్స్ 30 శాతానికి పైగా రాబడిని అందించాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (44.5 శాతం), హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ (సుమారు 40 శాతం) అత్యధిక రాబడులను ఇచ్చాయి.
స్కీమ్ పరిమాణాన్ని పరిశీలిస్తే, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అతిపెద్ద మ్యూచువల్ ఫండ్‌గా నిలిచింది. తరువాత ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఉంది.
Mid Cap schemes | 1-year-return (%) | AUM ( ₹crore) |
---|---|---|
Edelweiss Mid Cap Fund | 39.07 | 8,609.41 |
Franklin India Prima Fund | 33.07 | 12,514.43 |
HSBC Midcap Fund | 39.98 | 12,335.69 |
Invesco India Mid Cap Fund | 44.48 | 6,157.82 |
JM Midcap Fund | 34.80 | 1,408.28 |
Kotak Emerging Equity Fund | 34.37 | 52,977.35 |
WhiteOak Capital Mid Cap Fund | 33.73 | 2,794.76 |
(ఆధారం: యాంఫీ, డిసెంబర్ 28 నాటికి రాబడులు)
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో ఐదు స్కీమ్స్ అధిక రాబడులను ఇచ్చాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ ద్వారా అత్యధిక రాబడులు (40 శాతానికి పైగా) లభిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటిది దాని ఆస్తి పరిమాణం పరంగా అతిపెద్ద ఫండ్, రెండొవది రూ .458 కోట్ల చిన్న ఏయూఎంతో అతి చిన్నది!
Small Cap funds | 1-year-return (%) | AUM ( ₹crore) |
---|---|---|
Bandhan Small Cap Fund | 44.46 | 9,577.84 |
Invesco India Smallcap Fund | 38.00 | 6,101.59 |
ITI Small Cap Fund | 34.88 | 2,466.70 |
LIC MF Small Cap Fund | 40.94 | 458.68 |
Tata Small Cap Fund | 31.52 | 9,574.09 |
(ఆధారం: యాంఫీ, డిసెంబర్ 28 నాటికి రాబడులు)
వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో పాస్ట్ హిస్టరీని చూస్తారు. కానీ గత రాబడులు.. స్కీమ్ భవిష్యత్తు ప్రదర్శనకు హామీ ఇవ్వదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పథకం గతంలో అసాధారణ పనితీరును కనబరిచినంత మాత్రాన, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని చెప్పలేము.
(గమనిక: ఈ కథ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం