భారత్‌లో ఇంధన ధరల ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినియోగదారుల జేబులకు ఎల్లప్పుడూ చిల్లు పడుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది టూ వీలర్ మైలేజీ ఎంత ఇస్తుందో కొనేముందు అంచనా వేస్తారు. విద్యార్థి అయినా, ఆఫీసుకు వెళ్లేవారైనా, డెలివరీ బాయ్ అయినా పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం మైలేజీ ఇచ్చే బైకులను చూడాలి. అధిక మైలేజీని అందించే భారతదేశంలో టాప్ 5 మోటార్ సైకిళ్లు చూద్దాం..
హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది కనీస ఇంధన ఖర్చుతో గరిష్ట మైలేజీని ఇచ్చే బైక్. లీటరుకు 70-75 కి.మీ ఇస్తుందని చెబుతారు. సాధారణంగా నగరాలు లేదా పట్టణాల చుట్టూ చిన్న ప్రయాణాలకు సరిపోతుంది. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. డిజైన్‌లో తేలికైనది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.77,226 నుంచి మెుదలవుతుంది
ఈ స్టైలిష్ టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది చాలా తేలికైనది, సున్నితమైన ఇంజిన్, స్పోర్టియర్ స్టైలింగ్ ఉంటుంది. ఇది రోజువారీ ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర రూ. 85,117 నుండి ప్రారంభమవుతుంది.
బజాజ్ ప్లాటినా 100 లీటరుకు 70 నుండి 75 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గొప్ప ప్రయాణాన్ని అందించడమే కాకుండా.. ఇందులో పొడవైన, సౌకర్యవంతమైన సీట్లు, మృదువైన స్ప్రింగ్‌లు, మంచి బౌన్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ కూడా. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర రూ. 85,765 నుండి ప్రారంభమవుతుంది.
హోండా షైన్ 100 అనేది మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడ్ కోరుకునే వారికి అనువైన బైక్. ఇది లీటరుకు 65-70 కి.మీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. దీని సౌండ్ ఎక్కువగా రాదు, నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర రూ. 88,963 నుండి ప్రారంభమవుతుంది.
నమ్మకమైన, సామర్థ్యం గల కమ్యూటర్ బైక్ కోసం చూస్తున్న వారికి రేడియన్ ఒక గొప్ప ఎంపిక. సౌకర్యవంతమైన సీటు, యూఎస్‌బీ పోర్ట్ ఛార్జింగ్, దృఢమైన బాడీతో ఇది లీటర్‌కు సగటున 65-70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ప్రయాణ ప్రయోజనాల కోసం ద్విచక్ర వాహనం కోసం చూస్తున్న వారికి ఈ బైక్ సరైన ఆప్షన్. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర రూ. 91 222 నుండి ప్రారంభమవుతుంది.