రూ.10,000లోపు ధరలో ఎల్ఈడీ టీవీలు.. ఈ లిస్టులో ఒకదాని రేటు రూ.4999 మాత్రమే!-best led tvs under 10000 rupees and one in this list is priced at just 4999 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.10,000లోపు ధరలో ఎల్ఈడీ టీవీలు.. ఈ లిస్టులో ఒకదాని రేటు రూ.4999 మాత్రమే!

రూ.10,000లోపు ధరలో ఎల్ఈడీ టీవీలు.. ఈ లిస్టులో ఒకదాని రేటు రూ.4999 మాత్రమే!

Anand Sai HT Telugu

LED TV : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో రూ.10,000లోపు ధరలో టీవీలు ఉన్నాయి. ఈ లిస్టులో చౌకైన టీవీ ధర కేవలం రూ.4999 మాత్రమే. ఓసారి లిస్టు చూసేద్దాం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మార్కెట్లో అన్ని రేంజ్‌ల ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. మీరు సరసమైన ధరలో ఉత్తమ ఫీచర్లతో కూడిన ఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ మీకోసం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో రూ.10,000లోపు ధరతో టీవీలు దొరుకుతున్నాయి. వాటి గురించి చూద్దాం..

వీడబ్ల్యూ

60 సెం.మీ (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ హెచ్‌డి రెడీ ఎల్‌ఈడీ టీవీ విడబ్ల్యు 24 ఎ (బ్లాక్). ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ .4999కు లభిస్తుంది. ఈ టీవీలో కంపెనీ 1366×768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ లెవల్ 300 నిట్స్. ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్, 20వాట్ సౌండ్ అవుట్ పుట్‌తో ఈ టీవీ వస్తుంది. టీవీ ఫ్రేమ్‌లెస్ డిజైన్ దాని రూపాన్ని చాలా ప్రీమియంగా చేస్తుంది.

రియల్‌మీ

రియల్‌మీ టెక్ లైఫ్ సినీసోనిక్ 80 సెం.మీ (32 అంగుళాలు) క్యూఎల్ఈడీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కే లభిస్తుంది. ఈ టీవీలో 1366×768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో, 20 వాట్ సౌండ్ అవుట్ పుట్‌ను అందిస్తుంది. 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై ఇది పనిచేస్తుంది.

వోక్స్

ఫ్రేమ్‌లెస్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ వీడబ్ల్యూ24సీ3 (బ్లాక్) వోక్స్‌. ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.5,999 ధరకు లభిస్తుంది. ఇందులో మీకు గొప్ప ఫ్రేమ్‌లెస్ డిజైన్ లభిస్తుంది. ఈ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్ట్రాంగ్ సౌండ్ కోసం కంపెనీ ఈ టీవీలో 24 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తోంది. ఈ టీవీలో 5 సౌండ్ మోడ్స్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, టీవీలో హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్ట్‌లు ఉన్నాయి.

కొడాక్

కొడాక్ 80 సెం.మీ(32 అంగుళాలు) స్పెషల్ ఎడిషన్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ 32ఎస్ఈ5001బీఎల్. కొడాక్ టీవీ ధర రూ.8499. ఈ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1366×768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ టీవీలో కంపెనీ 30 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తోంది. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ పోర్ట్‌లు లభిస్తాయి.

ఏసర్

ఏసర్ 80 సెం.మీ (32 అంగుళాలు) జె సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ ఎల్‌ఈడీ టీవీ. ఈ టీవీ ధర అమెజాన్ ఇండియాలో రూ.9,999. ఫీచర్ల విషయానికొస్తే, టీవీలో 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. టీవీలో అందించే డిస్‌ప్లే వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలు. ఈ టీవీలో మీరు డాల్బీ ఆడియోతో హై ఫిడిలిటీ స్పీకర్లను చూస్తారు. టీవీ సౌండ్ అవుట్ పుట్ 30 వాట్స్.

టీసీఎల్

టీసీఎల్ 32 అంగుళాలు మెటాలిక్ బెజెల్ లెస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ 32ఎల్4బీ. ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.9,490 ధరతో లిస్ట్ అయింది. ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌తో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లభిస్తుంది. టీవీలో బలమైన సౌండ్ కోసం డాల్బీ ఆడియోను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ టీవీ గొప్ప బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్బీ పోర్టును చూడొచ్చు.

Anand Sai

eMail

సంబంధిత కథనం