రూ.7 వేల కంటే తక్కువలో వచ్చే బెస్ట్ టీవీలు.. డాల్బీ సౌండ్ కూడా ఎంజాయ్ చేయెుచ్చు!-best led tvs available on amazon under 7000 rupees without any offer you can enjoy dobly sound ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.7 వేల కంటే తక్కువలో వచ్చే బెస్ట్ టీవీలు.. డాల్బీ సౌండ్ కూడా ఎంజాయ్ చేయెుచ్చు!

రూ.7 వేల కంటే తక్కువలో వచ్చే బెస్ట్ టీవీలు.. డాల్బీ సౌండ్ కూడా ఎంజాయ్ చేయెుచ్చు!

Anand Sai HT Telugu

ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.7,000 లోపు ధరలో లభించే టీవీలు ఉన్నాయి. స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ కూడా బాగుంటాయి. ఈ టీవీల గురించి తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

మీరు తక్కువ బడ్జెట్‌లో టీవీ పొందాలని ఆలోచిస్తుంటే.. బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.7,000లోపు ధరలో లభించే మూడు టీవీల గురించి చూద్దాం..ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.5199 మాత్రమే. ఈ టీవీల్లో బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ ప్లే, సౌండ్ లభిస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ టీవీలు వారంటీని కూడా అందిస్తాయి.

ఎక్స్ఎలెక్ట్రాన్

ఎక్స్ఎలెక్ట్రాన్ 60 సెం.మీ (24 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ మోడల్ 24 ఎస్టీవీ(బ్లాక్) ఎ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ ధర అమెజాన్ ఇండియాలో రూ .5199. ఈ గ్రేట్ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గా ఉంది. దీనిలో మీరు 20 వాట్ల బలమైన సౌండ్ అవుట్‌పుట్ పొందుతారు. దీంతోపాటు డాల్బీ ఆడియోను కూడా కంపెనీ అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.

కొడాక్

కొడాక్ 60 సెం.మీ (24 అంగుళాలు) స్పెషల్ ఎడిషన్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 24ఎస్ఈ5002 (బ్లాక్) ఈ టీవీ ధర అమెజాన్ ఇండియాలో రూ.5999. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. టీవీలో ఆడియో అవుట్‌పుట్ 20 వాట్స్ ఉంటుంది. లైనక్స్ ఓఎస్‌పై పనిచేసే ఈ టీవీలో ఇన్‌బిల్ట్ వైఫై, మిరాకాస్ట్ ఉన్నాయి. 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.

వీడబ్ల్యూ

వీడబ్ల్యూ 60 సెం.మీ (24 అంగుళాలు) లినక్స్ ఫ్రేమ్ లెస్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ. వీడబ్ల్యూ24సి3 (బ్లాక్) అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర రూ.6999. అద్భుతమైన ఫీచర్లు కనిపిస్తాయి. 1366×768 పిక్సెల్ రిజల్యూషన్తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే ఉండనుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. టీవీ బాక్స్ స్పీకర్లు, స్టీరియో సరౌండ్ సౌండ్‌తో వస్తుంది. ఈ టీవీ 18 నెలల వారంటీతో వస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.