Geyser Discount : చలికాలంలో వేడి నీరు కావాల్సిందే.. ఈ గీజర్ల డిస్కౌంట్‌పై ఓ లుక్కేయండి.. ఉపయోగపడొచ్చు
Water Heater Discounts Online : చలికాలంలో వేడి నీటి స్నానం లేదంటే చాలా మంది ఇబ్బంది పడుతారు. అందుకే ఈ సమయంలో గీజర్ కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ కూడా ఆ ప్లాన్ ఉంటే కొన్ని డిస్కౌంట్స్ నడుస్తున్నాయి.
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది వేడినీటి కోసం చూస్తారు. చన్నీటి స్నానం అంటే దూరం పరుగెడతారు. మీరు కూడా గీజర్ కొనే ఆలోచనలో ఉంటే మీకోసం కొన్ని అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్లతో గీజర్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. వీటీ సహాయంతో నీటిని త్వరగా వేడి చేయవచ్చు. ఈ మోడళ్లలో కొన్ని డిజిటల్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి. సులభమైన టెంపరేచర్ సెట్టింగులను అందిస్తాయి. భారీ డిస్కౌంట్లలో లభ్యమయ్యే మోడళ్ల జాబితాను ఇక్కడ చూడండి..
వి-గార్డ్ డివినో గీజర్ 15 లీటర్
ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్, ప్రెజర్ రిలీజ్ వాల్వ్‌ను అందించే ఈ గీజర్‌లో అధునాతన మల్టీ లేయర్డ్ సేఫ్టీ సిస్టమ్ ఉంది. ఇది 5-స్టార్ రేటింగ్, విట్రియస్ ఎనామెల్ ట్యాంక్ కోటింగ్ ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇది 8-బార్ పీడనాన్ని నిర్వహించగలదు. థర్మల్ కటౌట్ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ గీజర్ ధర రూ.6,699 కాగా.. దీనికి బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
రాకోల్డ్ బుయోనో ప్రో ఎన్ఎక్స్జి స్టోరేజ్ వాటర్ హీటర్ 15ఎల్
ఇది 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఎబిఎస్ బాడీని పొందుతుంది. తుప్పు నుంచి రక్షణ ఉంటుంది. ఈ గీజర్ మూడు విభిన్న సేఫ్టీ స్థాయిలను కలిగి ఉంది. దీనిని వైట్ లేదా బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. పరిమిత కాల ఆఫర్ ప్రకారం.. దీని ధర రూ.6,999గా ఉంది.
వి-గార్డ్ విక్టో 25 లీటర్ వాటర్ హీటర్
వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తున్న ఈ గీజర్ 25 లీటర్ల కెపాసిటీ, 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్‌తో వస్తుంది. ఈ గీజర్‌లో కనిపించే ప్రత్యేక ఫీచర్ల గురించి చూస్తే.. ఇది ఓవర్ హీట్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. డిస్కౌంట్ కారణంగా అమెజాన్ నుంచి రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు.
యాక్టివా అమెజాన్ 10ఎల్ వాటర్ హీటర్
యాంటీ రస్ట్ కోటెడ్ ట్యాంక్‌తో కూడిన ఈ గీజర్ 5 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. ఎబిఎస్ టాప్ బాటమ్‌ను కలిగి ఉంది. ఈ గీజర్ 10 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. 3000 వాట్ల కాపర్ హీటింగ్ ఎలిమెంట్‌ను పొందుతుంది. ఈ గీజర్ హీటింగ్ స్టేటస్ చూపించడానికి ఎల్ఈడీ ఇండికేటర్లు వస్తాయి. ఇది ఐవరీ కలర్‌లో కూడా లభిస్తుంది. భారీ డిస్కౌంట్ కారణంగా ఈ గీజర్‌ను కేవలం రూ.2,899కే ఆర్డర్ చేయవచ్చు.
హావెల్స్ అడోనియా స్పిన్ 15 లీటర్
వాల్ మౌంటెడ్ గీజర్ టెంపరేచర్ సెన్సింగ్ నాబ్‌ను పొందుతుంది. దాని ట్యాంక్‌పై పూర్తి ఏడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. ఈ గీజర్ సామర్థ్యం 15 లీటర్లు, ఫెర్రోగ్లాస్-కోటెడ్ ట్యాంక్ కలిగి ఉంది. స్పెషల్ హీటింగ్ ఎలిమెంట్‌తో పాటు, ఈ గీజర్ అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్లో ప్రత్యేక డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.10,999గా ఉంది.