Best gaming smartphones : రూ. 20వేల బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
ఫిబ్రవరి 2025 లో రూ .20,000 లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని మీకోసం మేము తీసుకొచ్చాము. కో, ఐక్యూ, మోటోరోలా, రియల్మీ సంస్థలకు గ్యాడ్జెట్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..

గేమర్స్‌కి క్రేజీ న్యూస్! ఈ ఫిబ్రవరిలో రూ. 20వేల ధరలోపే మంచి గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్‌ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. పోకో, ఐక్యూ, మోటోరోలా, రియల్మీ సంస్థలకు చెందిన రూ. 20వేల బడ్జెట్లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ఠ్ని ఇక్కడ తెలుసుకోండి..
1) పోకో ఎక్స్6 ప్రో:
పోకో ఎక్స్6 ప్రో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీతో పాటు గ్రాఫిక్స్ టాస్క్‌లను నిర్వహించడానికి మాలి-జీ615 జీపీయూతో ఇది పనిచేస్తుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ఎక్స్ 6 ప్రో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. షియోమీ హైపర్ ఓఎస్ ఓవర్ లేతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పనిచేసే ఈ ఫోన్లో ఐపీ54 రేటింగ్, ఇన్- డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
2. ఐక్యూ జెడ్9:
ఐక్యూ జెడ్9లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని అందించారు. ఇందులో 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైబ్రెంట్ కలర్స్, ఫ్లూయిడ్ విజువల్స్ ఉన్నాయి. రియర్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + ముందు భాగంలో పదునైన సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో యాప్స్, మీడియాకు పుష్కలమైన స్పేస్‌ని అందిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.
3. రియల్మీ నార్జో 70 టర్బో:
రియల్మీ నార్జో 70 టర్బో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, మాలి జీ615 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ని ఇందులో అందించారు.
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
4. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రినో 619 జీపీయూ, 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది.
5) మోటోరోలా ఎడ్జ్ 50 నియో:
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచ్ ఎల్టీపీఓ పోఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. డిస్ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఐపీ68 డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. మెరుగైన మన్నిక కోసం ఎంఐఎల్-ఎస్టీడీ -810 హెచ్ సర్టిఫికేషన్‌ని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్-బ్యాక్డ్ డ్యూయెల్ స్టీరియో స్పీకర్లు మల్టీమీడియా అనుభవాన్ని పెంచుతాయి.
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఏఐ ఆప్టిమైజేషన్ ద్వారా, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ ఎక్స్ప్యాండెబుల్తో వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. మోటోరోలా ఐదేళ్ల సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తుంది.
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం మోటో ఎడ్జ్ 50 నియోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. హై క్వాలిటీ సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
సంబంధిత కథనం