ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏడాది పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీని అందించే బ్యాంకులు!-best fixed deposit interest rates in 2025 public sector banks and private banks check list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏడాది పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీని అందించే బ్యాంకులు!

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏడాది పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీని అందించే బ్యాంకులు!

Anand Sai HT Telugu

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇటీవలి కాలంలో చాలా మంది పాటించే పెట్టుబడి సూత్రం. మీరు కూడా ఎఫ్‌డీలో తక్కువ కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ కోసం మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల గురించి తెలుసుకోండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌

ిక్స్‌డ్ డిపాజిట్ మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచింది. దీని ఫలితంగా కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించుకున్నాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రమే కస్టమర్లను ఆకర్షించడానికి 8.25 శాతం బంపర్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాంటి బ్యాంకులు ఏమున్నాయో చూద్దాం.. అధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేస్తే మంచి రాబడులు చూస్తారు.

  1. ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరం ఎఫ్‌డీపై 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రస్తుతం ఇది ఎఫ్‌డీలలో అత్యధిక వడ్డీ రేటు. ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7.75 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. మీరు ఈ బ్యాంకులో మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక్కడ తక్కువ మొత్తంతో కూడా ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు.
  2. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.
  3. హిందూజా గ్రూప్‌కు చెందిన ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ రెండూ సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరం ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఎక్కువ ఆదాయం కోసం ఇది బెటర్ ఆప్షన్. ఈ బ్యాంకుల్లో డిజిటల్ ఎఫ్‌డీలను తెరిచే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.
  4. బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇవి కూడా బెటర్ ఆప్షన్. ఎఫ్‌డీలలో కస్టమర్ సేవ కలిగిన ప్రైవేట్ బ్యాంకుల్లో ఇవి కూడా ఉన్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.