Best FD rates : ఈ ఐదు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.. చెక్ చేయండి
Best FD rates : భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చాలా మంది పెట్టుబడి పెడతారు. అయితే అధిక వడ్డీ రేట్లు ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీలు సాధారణంగా భద్రత, రాబడికి ప్రసిద్ధి చెందాయి. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక రేట్లు కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD) భద్రత, హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. ఈ కారణంగా చాలా మందికి ఇది ప్రముఖ పెట్టుబడి ఎంపిక అని చెప్పవచ్చు. FDలలో పెట్టుబడి పెడితే సరిపోదు.. రాబడిని పెంచడానికి రేట్లను కూడా పోల్చడం చాలా అవసరం. బ్యాంకుల సంబంధిత వెబ్‌సైట్‌ల నుండి తాజా డేటా ప్రకారం అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకుల గురించి చూద్దాం.. కొన్ని పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తాయి .
యూనిటీ బ్యాంక్
సాధారణ ప్రజల కోసం : 6 నెలలు - 201 రోజులు: 8.50 శాతం, 501 రోజులు: 8.75 శాతం, 1001 రోజులు: 9.00 శాతం, 701 రోజులు: 8.75 శాతం.
సీనియర్ సిటిజన్ల కోసం: 6 నెలలు - 201 రోజులు: 9.00 శాతం, 501 రోజులు: 9.25 శాతం, 1001 రోజులు: 9.50శాతం, 701 రోజులు: 9.25 శాతం.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సాధారణ ప్రజల కోసం: 546 - 1111 రోజులు: 9.00శాతం, 1112 - 1825 రోజులు: 8.00శాతం,
సీనియర్ సిటిజన్ల కోసం: 546 - 1111 రోజులు: 9.50శాతం, 1112 - 1825 రోజులు: 8.50శాతం.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సాధారణ ప్రజల కోసం: 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల 1 రోజు వరకు: 8.60 శాతం, 2 సంవత్సరాల 2 రోజులు: 8.65 శాతం, 2 సంవత్సరాల 3 రోజుల నుండి 3 సంవత్సరాల వరకు: 8.60 శాతం.
సీనియర్ సిటిజన్ల కోసం: 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల 1 రోజు వరకు: 9.10 శాతం, 2 సంవత్సరాల 2 రోజులు: 9.10 శాతం, 2 సంవత్సరాల 3 రోజుల నుండి 3 సంవత్సరాల వరకు: 9.10 శాతం.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సాధారణ ప్రజల కోసం: 18 నెలల నుండి 24 నెలల వరకు: 8.55 శాతం,
సీనియర్ సిటిజన్ల కోసం: 18 నెలల నుండి 24 నెలల వరకు: 9.05 శాతం.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సాధారణ ప్రజల కోసం: 444 రోజులు: 8.50 శాతం.
సీనియర్ సిటిజన్ల కోసం: 444 రోజులు: 8.77 శాతం.
చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితమేనా?
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FDలు) బీమాను అందిస్తుంది. ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు కవర్ చేస్తుంది. DICGC పరిధిలోకి వచ్చే బ్యాంకులకు బీమా రక్షణ గురించి వివరించే కరపత్రాలు ఉంటాయి. వీటిని బ్యాంకు శాఖల వద్ద ప్రదర్శించాలి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు బ్యాంక్ బీమా స్థితికి సంబంధించి ధృవీకరణ కోసం బ్రాంచ్ అధికారిని అడగవచ్చు.
గమనిక : ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి సంబంధిత నిర్ణయం తీసుకునే ముందు సలహాదారుతో మాట్లాడండి. పైన చెప్పిన వడ్డీ రేట్లు సంబంధిత తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.