Skoda Kylaq : ఇక రోడ్లపై కొత్త ఫ్యామిలీ ఎస్యూవీ హవా- స్కోడా కైలాక్ డెలివరీ షురూ..
స్కోడా కైలాక్‌పై కీలక అప్డేట్! ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫ్యామిలీ ఎస్యూవీ డెలివరీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కైలాక్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్ ఎంట్రీ అయిన స్కోడా కైలాక్‌పై కీలక అప్డేట్! ఫ్యామిలీ ఎస్‌యూవీగా వస్తున్న స్కోడా కైలాక్ డెలివరీలు సోమవారం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్కోడా కైలాక్ ధర..
బేస్ స్పెక్ కైలాక్ ధర రూ .7.89 లక్షలు. ఇది సెగ్మెంట్లోనే అత్యంత సరసమైన ఆప్షన్స్‌లో ఒకటి. టాప్ స్పెక్ స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ధర రూ .14.40 లక్షలు. ఇక మాన్యువల్ ట్రాన్స్మిషన్ వర్షెన్ ధర రూ .13.35 లక్షలు. మిడ్ స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ ధరలు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ రూ.9.59 లక్షలు, రూ.11.40 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ రూ.10.59 లక్షలు, రూ.12.40 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలను గుర్తుపెట్టుకోవాలి.
స్కోడా కైలాక్: డిజైన్..
కొత్త స్కోడా కైలాక్ బ్రాండ్ నుంచి వస్తున్న అతిచిన్న ఎస్యూవీ !మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త కైలాక్.. స్కోడా మాడ్రెన్-సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్‌లో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, బాక్సీ ప్రొఫైల్, షార్ట్ ఓవర్ హాంగ్లను కలిగి ఉంది. బటర్‌ఫ్లై గ్రిల్ స్టైలిష్‌గా ఉంది. ఈ చిన్న ఎస్యూవీ టాప్ వేరియంట్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను పొందనుండగా, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, హెడ్ ల్యాంప్‌లు స్టాండర్డ్ రేంజ్లో ఉంటాయి.
స్కోడా కైలాక్: ఫీచర్లు..
స్కోడా కైలాక్‌లో డిజిటల్ క్లస్టర్, 10.1-ఇంచ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి ఉన్నాయి. ఇది వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. ఇవి టాప్ వేరియంట్లకు పరిమితం కాగా, ఎంట్రీ లెవల్ వర్షెన్లు 5 ఇంచ్ టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ క్లస్టర్‌కి పరిమితం కానున్నాయి.
కైలాక్ ఎస్యూవీ ముందు వరుసకు వెంటిలేషన్‌తో కూడిన 6-వే ఎలక్ట్రిక్ సీట్లను కలిగి ఉంది. ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి సింగిల్, డ్యూయల్-టోన్ క్యాబిన్ వస్తుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ + వివిధ రకాల ఫ్యాబ్రిక్ అప్హోలిస్ట్రీని కలిగి ఉండగా.. టాప్-స్పెక్ ప్రెస్టీజ్ ట్రిమ్ లెథరెట్ సీట్లను పొందుతుంది. ఈ వేరియంట్‌తో పాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందించనున్నారు.
కొత్త కైలాక్ ఎస్‌యూవీని దేశంలోని కఠినమైన డ్రైవింగ్ పరిస్థితులకు సిద్ధం చేయడానికి 8,00,000 కిలోమీటర్ల భారతీయ భూభాగంలో పరీక్షించినట్లు స్కోడా పేర్కొంది! ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, మల్టీ-కొలిషన్ బ్రేక్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి 25కి పైగా యాక్టివ్- పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
స్కోడా కైలాక్: ఇంజిన్..
ఫ్యామిలీ ఎస్‌యూవీగా వస్తున్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ మూడు సిలిండర్ల టీఎస్ఐ పెట్రోల్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఇది స్కోడా కుషాక్‌తో సహా ఇతర భారతదేశ 2.0 ప్రాజెక్ట్ కార్లకు ఇంజిన్‌గా ఉంటోంది.
కైలాక్లోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 114బీహెచ్పీ పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హై ఎండ్ వేరియంట్లలో, ఈ ఇంజిన్.. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రన్స్మిషన్తో కనెక్ట్ చేసి ఉంటుంది. అయితే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ బేస్ క్లాసిక్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.
ఈ స్కోడా కైలాక్‌పై సంస్థ భారీ ఆశలు పెట్టుకుంది. స్కోడా కుషాక్, స్కోడా స్లావియా కార్లు టైర్ -1 నగరాల్లో బ్రాండ్‌కి సహాయపడతాయని, కైలాక్‌తో టైర్ -2, టైర్ -3 నగరాల్లోనూ మంచి డిమాండ్ వస్తుందని అంచనా వేస్తోంది.
సంబంధిత కథనం