Family electric car : మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు.. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఎలా ఉందంటే..-best family electric car mahindra xev 9e first drive review setting new benchmark ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Family Electric Car : మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు.. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఎలా ఉందంటే..

Family electric car : మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు.. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ ఎలా ఉందంటే..

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 12:22 PM IST

Mahindra XEV 9e : మహీంద్రా ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్ఈవీ 9ఈ ఎలా ఉంది? ఈ ఫ్యామిలీ ఈవీని కొనొచ్చా? హెచ్​టీ ఆటో ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూని ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ
మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ

ఇండియాలో రెండు సరికొత్త ఎలక్ట్రిక్​ కార్లను లాం చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. వీటిల్లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈపై కస్టమర్స్​లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మా హెచ్​టీ ఆటో బృందం.. కొత్త ఎలక్ట్రిక్​ కారును డ్రైవ్​ చేసి రివ్యూ చేసింది. మీరు ఒకవేళ ఈ ఈవీ కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఈ రివ్యూ మీకు ఉపయోగపడుతుంది. చూసేయండి మరి..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ: ప్లాట్​ఫామ్​..

ఐఎన్జీఎల్ఓగా పిలిచే ప్లాట్​ఫామ్​పై మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ తయారైంది. దీని ద్వారా క్యాబిన్​ స్పేస్​ మరింత పెరుగుతుంది. ఈ ప్లాట్​ఫామ్​ రెండు బ్యాటరీ ప్యాక్ పరిమాణాలను సపోర్ట్ చేస్తుంది. అవి.. 59 కిలోవాట్, 79 కిలోవాట్. వీటి ద్వారా 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు రియల్ వరల్డ్ రేంజ్​ను ఆశించవచ్చని మహీంద్రా తెలిపింది. 175 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్​తో కేవలం 20 నిమిషాల్లో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతానికి పెంచే ఫాస్ట్​ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ: డిజైన్..

ఎక్స్​ఈవీ 9ఈని కూపే ఎస్​యూవీగా డిజైన్ చేశారు. కానీ ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్​ కారు సైజులో పెద్దది. ఇది 4.7 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, 1.9 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 207 మిల్లీమీటర్లు కాగా, టర్నింగ్ సర్కిల్ 10 మీటర్లు మాత్రమే ఉంది.

ముందు భాగంలో త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్​తో పాటు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, లైట్​బార్​ వంటివి ఉన్నాయి. అనుకున్నట్లుగానే ముందు భాగంలో గ్రిల్ లేదు! ఇరువైపులా, మోటరైజ్ చేసిన ఫ్లష్ సిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక డోర్ హ్యాండిల్స్ సీ-పిల్లర్​పై ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ 20 ఇంచ్​ వరకు పరిమాణంలో ఉంటాయి. కారు పొడవు అంతటా గ్లోస్ బ్లాక్ క్లాడింగ్ నడుస్తుంది. రూఫ్ లైన్ కూపే లాంటిది, కానీ మంచి హెడ్​రూమ్ ఉంది. వెనుక కూర్చున్నవారికి సీటింగ్​ సరిపోతుంది. వెనుక భాగంలో పదునైన టెయిల్ ల్యాంప్స్, స్పాయిలర్, గ్లాస్ బ్లాక్​లో బంపర్ ఉన్నాయి. బూట్ స్పేస్ 663 లీటర్లు. 150 లీటర్ల పొడవైన ఫ్రాంక్ కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: ఇంటీరియర్..

మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కారు క్యాబిన్​లో మీరు మొదట గమనించేది మూడు స్క్రీన్​లు! అవి ఒక్కొక్కటి 31.24 సెంటీమీటర్లు ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అట్రాక్టివ్​గా ఉంది. డాల్బీ అట్మాస్​తో 16 స్పీకర్​ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్​కు కనెక్ట్ కావడం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రత్యేకత.

యూట్యూబ్, నెట్​ఫ్లిక్స్​, డిస్నీ+ వంటి మీడియా యాప్స్​ ప్యాసింజర్ స్క్రీన్​ ప్లే చేస్తుంది.

సెంటర్ కన్సోల్​లో రోటరీ డయల్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం కొన్ని బటన్లు, కప్ హోల్డర్లు, స్టోరేజ్​తో కూడిన ఆర్మ్​రెస్ట్ ఉన్నాయి. రెండు యూఎస్బీ టైప్ సీ పోర్టులు, వైర్లెస్ ఛార్జర్, మొబైల్ ఫోన్ లేదా వాలెట్ కోసం క్యూబీ స్పేస్ ఉన్నాయి. అయితే, మహీంద్రా గ్లాస్ బ్లాక్​ను ఉపయోగిస్తుంది. ఇది వేలిముద్రలు, గీతలకు కారణం అవ్వొచ్చు. ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా హెడ్స్-అప్ డిస్​ప్లే కూడా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో ఉంది.

డ్రైవర్ అలసటను పర్యవేక్షించడమే కాకుండా వీడియోను రికార్డ్ చేయడం లేదా సెల్ఫీని క్లిక్ చేసే కెమెరా ఆటో పార్క్ ఇందులో ఉంది. ఇందులో బహుళ వినోద యాప్స్​ ఉన్నాయి, ఇవి వాహనం ఛార్జ్ అవుతున్నప్పుడు ఉపయోగపడతాయి. డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే కూడా చాలా క్రిస్ప్​గా ఉంటుంది. కానీ స్టీరింగ్ వీల్​లోని బటన్​లను ఉపయోగించి దానిని నియంత్రించేటప్పుడు ఫంక్షనింగ్​ కాస్త ఆలస్యంగా ఉంది. మహీంద్రా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కూడా అందిస్తోంది.

మహీంద్రా ఎక్స్ఈవీ ఈ9: పనితీరు, డ్రైవ్..

మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.8 సెకన్లలో అందుకుంటుందని, గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుందని, ఎలక్ట్రిక్ మోటార్ 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదని మహీంద్రా పేర్కొంది.

ఈ ఎస్​యూవీ ఒక రేర్ వీల్ డ్రైవ్! ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. రేస్ మోడ్​లో, థ్రాటిల్ స్పైకీ​గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్​యూవీ వెంటనే టేకాఫ్ అవుతుంది. రేంజ్ మోడ్ రోజువారీ ఉపయోగానికి సరైనది. ఇది పర్ఫెక్ట్ మిడ్-బ్యాలెన్స్​ను అందిస్తుంది. ఎక్స్​ఈవీ 9ఈ డ్రైవర్ స్టీరింగ్ ఇన్​పుట్​లకు ప్రతిస్పందిస్తుంది. స్టీరింగ్ విషయానికొస్తే, ఇది సిటీ స్పీడ్​ వద్ద చాలా తేలికగా ఉంటుంది. అధిక వేగంతో చక్కగా బరువు ఉంటుంది. బ్రేకులు మంచి కాన్ఫిడెన్స్​ను అందిస్తాయి, సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేయడం జరిగింది.

ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .21.90 లక్షల వద్ద ఈ ఎక్స్ఈవీ 9ఈ ఆకర్షణీయమైన ఆప్షన్​గ కనిపిస్తుంది. అయితే, ఈ ధర బేస్ వేరియంట్ కోసం ఉంటుంది. ఇది చిన్న బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంటుంది. ఛార్జర్ కూడ రాదు. ఎక్స్​ఈవీ 9ఈ డ్రైవ్ చేయడానికి సరదాగా ఉంటుంది. కుటుంబ విధులను చేయగలదు. ఫీచర్ లోడెడ్​ కూడా!

Whats_app_banner

సంబంధిత కథనం