Best Family Cars : ఫ్యామిలీతో తిరిగేందుకు ఈ కార్లు బెటర్ ఆప్షన్స్.. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ!
Best Family Cars : ఫ్యామిలీ కార్లు కొనాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లిస్టులో టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా ఉన్నాయి.

పండుగకు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? సరసమైన ధరలో ఫ్యామిలీకి సరిపోయే కార్ల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్లేందుకు కారు అనువుగా ఉంటే.. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఫంక్షన్స్‌కు వెళ్లేందుకు కూడా ఈ కార్లు బాగుంటాయి. కుటుంబానికి సరిపోయే కార్ల లిస్టులో టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలు ఉన్నాయి. తక్కువ ధరతో మంచి ఫీచర్లతో కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా రూ.8.69 లక్షల నుండి రూ.13.03 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 20.3 నుండి 26.11 kmpl మైలేజీని ఇస్తుంది. మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎర్టిగా ఎంపీవీలో ఏడుగురు ప్రయాణించవచ్చు. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌లైట్లు, ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ కనిష్ట ధర రూ.6 లక్షలు, గరిష్ట ధర రూ.8.97 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది ఐస్ కూల్ వైట్, సెడార్ బ్రౌన్, మూన్‌లైట్ సిల్వర్ వంటి వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 20 కి. మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారులో కూడా ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చుని చాలా దూరం ప్రయణించొచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా పలు ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
టయోటా రూమియన్
టయోటా రూమియన్ ఎంపీవీ ధర రూ. 10.44 నుండి రూ. 13.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఎస్, జీ, వీ వేరియంట్‌లను కలిగి ఉంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 20.11 నుండి 26.11 మైలేజీని ఇస్తుంది. ఈ కారులో ఏడుగురు సులభంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ వంటి వివిధ ఫీచర్లతో ఉంది. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.