కియా క్యారెన్స్ ఎంపీవీకి ప్రీమియం వర్షెన్‌గా ఇటీవలే ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది కియా క్యారెన్స్ క్లావిస్. ఈ మోడల్‌కి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో మీ సమీపంలోని డిలర్షిప్ షోరూమ్‌లో కియా క్యారెన్స్ క్లావిస్ని బుక్ చేసుకోవచ్చు. మూడు ఇంజిన్ ఆప్షన్లు ( 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ (113 బీహెచ్పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (158 బీహెచ్పీ), 1.5 లీటర్ డీజిల్ (114 బీహెచ్పీ), 7 వేరియంట్లలో ఈ ఎంపీవీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కియా క్యారెన్స్ క్లావిస్ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కియా క్యారెన్స్ క్లావిస్ బేస్ వేరియంట్ పేరు హెచ్‌టీఈ. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), ఆరు ఎయిర్‌బ్యాగులు వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఈ బేస్ వేరియంట్లో ఉన్నాయి. ఈ వేరియంట్లో ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఏబీఎస్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టెమ్, డౌన్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ (టీపీఎంఎస్ - హైలైన్) వంటివి ఉన్నాయి. డిజైన్ పరంగా, ఇది మెటల్ ఫినిష్‌తో ముందు- వెనుక స్కిడ్ ప్లేట్లు, పెట్రోల్ వేరియంట్ కోసం 15 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్- డీజిల్ వేరియంట్ కోసం 16-ఇంచ్ స్టీల్ వీల్స్‌ను కియా మోటార్స్ అందిస్తోంది.
కియా క్యారెన్స్ క్లావిస్ ఎంపీవీ ఇంటీరియర్.. బ్లాక్ అండ్ బీజ్ డ్యూయెల్-టోన్ థీమ్‌తో బ్లాక్ మెటల్ పెయింట్ డ్యాష్‌బోర్డ్‌తో వస్తుంది. నలుపు, నేవీలో సెమీ లెథర్ సీట్లను ఈ బెస్ట్ ఫ్యామిలీ ఎంపీవీ కలిగి ఉంది. నాలుగు దశల స్పీడ్ కంట్రోల్‌తో కూడిన రెండు, మూడొవ వరుస డిఫ్యూజ్డ్ ఏసీ వెంట్లు, అన్ని డోర్లకు పవర్ విండోస్, టిల్ట్ అడ్జెస్ట్తో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫోల్డింగ్ కీ, థెఫ్ట్ అలారంతో కీలెస్ ఎంట్రీ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్ లాక్, మాన్యువల్‌గా అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీట్ హైట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
రెండొవ వరుస సీటు బ్యాక్ ఫోల్డింగ్ ఆర్మ్‌రెస్ట్ (ఏడు సీట్ల మోడళ్లలో), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, మూడొవ వరుస 50:50 స్ప్లిట్ సీట్లు, రెండొవ వరుస వన్-టచ్ ఈజీ ఎలక్ట్రిక్ డంబుల్ సీట్లు వంటివి ఉన్నాయి. ఫాలో-మీ-హోమ్ హెడ్ ల్యాంప్స్, రేర్ డోర్ సన్ షేడ్ కర్టెన్లు, మ్యాప్ ల్యాంప్, ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్స్ తో కూడిన సెంటర్ కన్సోల్, రేర్ ఆక్సిడెంట్ అలర్ట్, డబుల్ డీ-కట్ స్టీరింగ్ వీల్, ఆటో డోర్ లాక్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ సెన్సింగ్ ఆటో లాక్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
కియా క్యారెన్స్ క్లావిస్ హెచ్‌టీఈ వేరియంట్ ఆధారంగా రూపొందించిన హెచ్‌టీఈ (ఓ) వేరియంట్ అదనపు టెక్, స్టైలింగ్ కోసం ఎక్స్ట్రా ఫీచర్లను కలిగి ఉంది. షార్క్ ఫిన్ యాంటెనా, రేర్ వ్యూ కెమెరా, స్టీరింగ్‌లో అమర్చిన ఆడియో కంట్రోల్స్, వాయిస్ రికగ్నిషన్‌తో బ్లూటూత్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కంపాటబిలిటీతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఇందులో ఉంది. ఆడియో సిస్టెమ్ని సిక్స్ స్పీకర్ సెటప్‌కు అప్‌గ్రేడ్ చేశారు. అంతేకాకుండా, ఈ వేరియంట్ ఆటో లైట్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ టర్న్ సిగ్నల్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఔట్‌సైడ్ మిర్రర్లు, 16-ఇంచ్ స్టీల్ వీల్స్ ఈ వేరియంట్లో ఉన్నాయి.
హెచ్టీకే వేరియంట్ అనేది హెచ్‌టీఈ (ఓ) కంటే మరింత కంఫర్ట్ ఓరియెంటెడ్- విజువల్ అప్డేటెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్, లగేజీ ల్యాంప్, ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
కియా క్యారెన్స్ క్లావిస్ హెచ్టీకే ఇంటీరియర్ నవీకరణలలో బ్లాక్ మెటల్ గార్నిష్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన డార్క్ మెటల్ పెయింట్ డ్యాష్‌బోర్డ్ ఉంది. ప్రీమియం ఫ్యాబ్రిక్, బ్లాక్ లెథరెట్ కాంబినేషన్ సీట్లతో బ్లాక్ అండ్ బీజ్ డ్యూయెల్ టోన్‌లో క్యాబిన్ని ఫినిష్ చేశారు. మల్టీ-సీట్ బ్యాక్ పాకెట్లు కూడా ఉన్నాయి.
ఈ వేరియంట్ అనేక ఉపయోగకరమైన ఫీచర్లతో హెచ్టీకేను మరింత మెరుగుపరుస్తుంది. రేర్ డీఫాగర్, క్రూయిజ్ కంట్రోల్, రేర్ వైపర్, వాషర్, పుష్ బటన్ స్టార్ట్, మోషన్ సెన్సార్‌తో కూడిన స్మార్ట్ కీ ఉన్నాయి. ఇందులో స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్, శాటిన్ క్రోమ్ బెల్ట్ లైన్ ఉన్నాయి. ఎక్స్రియర్ స్టార్ మ్యాప్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, డైమండ్ ఫినిష్‌తో కియా డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్‌తో ఈ మోడల్ని మరింత ఎలివేట్ చేసింది ఆటోమొబైల్ సంస్థ. 7-స్పీడ్ డీసీటీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి నిర్దిష్ట పవర్ట్రెయిన్ల కోసం, ఈ వేరియంట్లో ఆటో హోల్డ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లతో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఆటో ఫోల్డ్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్‌తో ఓఆర్వీఎంలను ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
హెచ్టీకే+ కు అదనంగా, హెచ్టీకే+ (ఓ) సౌకర్యం, శైలిపై దృష్టి సారించే ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆటో హోల్డ్ (డీసీటీ వేరియంట్ల కోసం)తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, మొదటి వరుసకు ఎల్ఈడీ మ్యాప్ ల్యాంప్స్, రెండొవ- మూడొవ వరుసలకు ఎల్ఈడీ రూమ్ ల్యాంప్స్, 17-ఇంచ్ క్రిస్టల్ కట్ డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వేరియంట్లో స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్ల కోసం), స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ ఛార్జర్, స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఉన్నాయి.
బెస్ట్ ఫ్యామిలీ ఎంపీవీ కియా క్యారెన్స్ క్లావిస్ హెచ్‌టీఎక్స్ వేరియంట్ ప్రీమియం ఫీచర్లు, అప్‌గ్రేడెడ్ టెక్నాలజీతో సమృద్ధిగా ఉంది. నేవిగేషన్, ఓటీఏ అప్డేట్స్తో కూడిన 12.25 ఇంచ్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 12.25 ఇంచ్ హెచ్డీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ కెమెరా స్మార్ట్ డాష్‌క్యామ్, 360 డిగ్రీల కెమెరా సిస్టెమ్ ఉన్నాయి.
కియా కనెక్ట్‌తో స్మార్ట్ కీ, ఆటో యాంటీ గ్లేర్ రేర్ వ్యూ మిర్రర్ ద్వారా విండోస్ ఆల్-అప్/డౌన్ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. డ్యూయెల్-ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ (టర్బో-పెట్రోల్ వేరియంట్), స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (డీజిల్ వేరియంట్), ఎల్ఈడీ పర్సనల్ ల్యాంప్స్, ఏక్యూఐ ఇండికేషన్‌తో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. ఇంటీరియర్ ట్రిటాన్ నేవీ- బీజ్ డ్యూయెల్-టోన్ సెమీ-లెథరెట్ సీట్లు, ప్యాడ్ ప్రింట్‌తో హై-క్వాలిటీ డ్యాష్‌బోర్డ్ గార్నిష్‌తో వస్తుంది.
డివైస్ హోల్డర్లతో సీట్‌బ్యాక్ టేబుల్స్, టెంపరేచర్ కంట్రోల్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్వాప్ స్విచ్, యూవీ కట్ సోలార్ గ్లాస్ విండోస్, డోర్ గార్నిష్ ఇన్సర్ట్ సైడ్, రెండో వరుసలో కూలింగ్ క్యాన్ హోల్డర్, టిల్టింగ్, టెలిస్కోపింగ్ అడ్జెస్టెబుల్ పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
హెచ్‌టీఎక్స్+ అనేది కియా క్యారెన్స్‌లో టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో హెచ్టీఎక్స్లోని ఫీచర్స్‌తో పాటు మరెన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు (డీసీటీ వేరియంట్ల కోసం), ఫోర్ వే పవర్డ్ డ్రైవర్ సీట్, వాక్-ఇన్ లివర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఇది డ్యూయెల్ కెమెరాతో స్మార్ట్ డాష్క్యామ్ని నిలుపుకుంటుంది. ముందు ప్యాసింజర్ సీటుకు స్లైడింగ్ లివర్ని సంస్థ ఇచ్చింది. మధ్య వరుసలో ఆరు సీట్ల మోడల్లో స్లైడ్, రెక్లైన్, డంబ్లింగ్ ఫీచర్లతో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఆడియో సిస్టెమ్ని ఎనిమిది స్పీకర్ల బోస్ ప్రీమియం సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. కియా లోగో ప్రొజెక్షన్‌తో కూడిన పుడిల్ ల్యాంప్స్‌ను కూడా వెనుక డోర్లలో చేర్చారు. ఈ ఫీచర్ ప్యాక్డ్ ప్రీమియం మోడల్‌ను పూర్తి చేస్తుంది.
సంబంధిత కథనం