Best Electric Scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు బాస్!-best electric scooters without driving license 4 best options for middle class people with good range and affordable ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు బాస్!

Best Electric Scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు బాస్!

Anand Sai HT Telugu

Best Electric Scooter : ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్ అవసరం లేకుండా పర్యావరణ అనుకూలమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అలాంటి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మోడళ్ల గురించి తెలుసుకోండి. వీటికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు.

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రస్తుతం డిమాండ్ బాగానే ఉంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకునేవారు వీటివైపు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చితే వీటికి అయ్యే ఖర్చు తక్కువ. ఈవీలు బ్యాటరీతో నడుస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు అధిక శక్తి గల మోటార్లను ఉపయోగిస్తాయి. అవి తక్కువ ధరకే మంచి రేంజ్, వేగం, సౌకర్యాన్ని అందిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం కలిగించే వాహనాలు. చాలా మంది వీటిని ఇష్టపడతారు.

పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు వినియోగదారులు ఈవీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలానే ఉన్నాయి. 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, 250 వాట్ల కంటే తక్కువ శక్తి, గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాంటి 4 మోడళ్లు గురించి తెలుసుకుందాం..

ఆంపియర్ రియో ​​ఎలైట్

ఈ స్కూటర్ రూ.42,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది 250 వాట్ల పవర్ తో వస్తుంది. ఇది 55-60 కి.మీ రేంజ్ అందిస్తుంది. గంటకు 25 కి.మీ వేగంతో వెళుతుంది. 5-6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

లోహియా ఓమా స్టార్

ఈవీ ప్రారంభ ధర రూ. 51,750. 250 వాట్ల శక్తిని అందిస్తుంది. ఇది 70 కి.మీ రేంజ్ అందిస్తుంది. గంటకు 25 కి.మీ వేగంతో వెళుతుంది. ఈ స్కూటర్ 4.5 నుండి 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

ఒకినావా ఆర్30

ఎలక్ట్రిక్ స్కూటీ ప్రారంభ ధర రూ.61,998 వరకు ఉంటుంది. 250 వాట్ల శక్తితో నడుస్తుంది. ఇది 60 కి.మీ రేంజ్ అందిస్తుంది. గంటకు 25 కి.మీ వేగాన్ని అందిస్తుంది. 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. 3 సంవత్సరాల వారంటీ వస్తుంది.

కోమాకి ఎక్స్‌జీటీ కేఎం

స్కూటర్ ప్రారంభ ధర రూ.56,890. ఇది 130-150 కి.మీ రేంజ్ అందిస్తుంది. గంటకు 60 కి.మీ వేగంతో వెళుతుంది. 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 1 సంవత్సరం వారంటీ ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం