భారత ఆటోమొబైల్ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోడ్ల మీద ఒకప్పుడు ఒకటి, రెండుగా కనిపించే ఈవీల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్‌ని ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తున్నాయి. పైగా, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎప్పటికప్పుడు దిగొస్తున్నాయి కూడా! రూ. 10లక్షల బడ్జెట్లో ఇప్పుడు దేశంలో మంచి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ ఈవీని తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ డేట్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి..
టాటా పంచ్- టాటా పంచ్ ఈవీలో రెండు ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 25 కేడబ్ల్యూహెచ్, ఇంకొకటి 35 కేడబ్ల్యూహెచ్. 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 421 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. టాటా పంచ్ ఈవీ బూట్ స్పేస్ 366 లీటర్లు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబీఎస్, ఈసీ, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, అలాయ్ వీల్స్ వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ టాటా ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలుగా ఉంది.
ఎంజీ కామెట్ ఈవీ- నగరాల్లో వినియోగానికి ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.36 లక్షల నుంచి రూ. 9.86 లక్షల వరకు ఉంటుంది. దీని సైజు చాలా చిన్నది. ఇందులో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. పవర్ స్టీరింగ్, ఏబీఎస్, పవర్ విండోస్, ఏసీ, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్ వంటివి కొన్ని కీలక ఫీచర్లు.
టాటా టియాగో ఈవీ- బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కి చెందిన మరో కారు ఈ టాటా టియాగో ఈవీ. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలు. రూ. 11.14లక్షల ఎక్స్‌షోరూం ధరకు టాప్ ఎండ్ మోడల్ కూడా వస్తుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 19.2 కేడబ్ల్యూహెచ్- 24 కేడబ్ల్యూహెచ్. మొదటి బ్యాటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. రెండో బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌తో 315 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ ఈవీ బూట్ స్పేస్ 240 లీటర్లు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబీఎస్, ఏసీ, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, వీల్ కవర్స్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కొన్ని కీలక ఫీచర్లుగా ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీని 50డీసీ ఛార్జర్‌తో 56 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10-80శాతం ఛార్జ్ అవుతుంది.
ఎంజీ కామెట్ ఈవీని 7.5 కేడబ్ల్యూతో ఛార్జ్ చేస్తే 10-100శాతం చేరుకునేందుకు 3 గంటల 5 నిమిషాల సమయం పడుతుంది.
ఇక టాటా టియాగో ఈవీని 7.3 కేడబ్ల్యూతో ఛార్జ్ చేస్తే 100శాతానికి చేరుకునేందుకు 3 గంటల 6నిమిషాల సమయం పడుతుంది.
వైవ్ మొబిలిటీ ఈవీ- ఇది కూడా ఒక చిన్న కారు. అంతేకాదు, ఇది భారత దేశ తొలి సోలార్ ఆధారిత ఎలక్ట్రిక్ కారు. ఇది మార్కెట్లో లాంచ్ అయ్యింది కానీ, ప్రొడక్షన్- డెలివరీలు ఇంకా మొదలవ్వలేదు. కానీ ఈ ఈవీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. డెలివరీలు ప్రారంభమైన తర్వాత ఇతర మోడల్స్‌కి ఇది మంచి పోటీ ఇవ్వొచ్చు. ఇందులో 9 కేడబ్ల్యూహెచ్, 12.6 కేడబ్ల్యూహెచ్, 18 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయ. వీటి రేంజ్ వరుసగా 125 కి.మీ, 175 కి.మీ, 250 కి.మీ. వీటీ ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 3.25 లక్షలు, రూ. 3.99 లక్షలు, రూ. 4.49 లక్షలుగా ఉన్నాయి. ఏసీ, పవర్ విండోస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, ల్యాప్‌టాప్ ఛార్జర్, పార్కింగ్ సెన్సార్ వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సంబంధిత కథనం