లక్ష రూపాయలలోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు.. సింగిల్ ఛార్జ్‌తో రేంజ్ కూడా బెటర్-best electric bikes under 1 lakh rupees budget with good range ola roadster x revolt rv1 oben rorr ez pure ev ecodryft ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  లక్ష రూపాయలలోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు.. సింగిల్ ఛార్జ్‌తో రేంజ్ కూడా బెటర్

లక్ష రూపాయలలోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు.. సింగిల్ ఛార్జ్‌తో రేంజ్ కూడా బెటర్

Anand Sai HT Telugu

బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ బైక్ కోసం చూసేవారి కోసం అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఛార్జింగ్ కూడా మంచి రేంజ్ ఇస్తుంది. అలాంటి బైక్స్ చూద్దాం..

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. రోజువారీ పనులకు ఇంధనంతో నడిచే వాహనాలను ఉపయోగించే బదులు డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ బైక్‌లను ఉపయోగించవచ్చు. ఇంధనం ఖర్చు చేయకుండా రోజూ మూడు గంటలు ఛార్జ్ చేయడం ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చు. అలాంటి టాప్ 4 బైక్‌లు ఇక్కడ ఉన్నాయి.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ఇటీవల ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌ను రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరకు ప్రవేశపెట్టింది. దీనికి 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లో 7 kW (9.4 బీహెచ్ పవర్) మోటార్ ఉంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో 40 కేఎంపీహెచ్ వేగాన్ని చేరుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త బైక్ బ్యాటరీపై 3 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వారంటీని అందిస్తోంది. ఇది 6.2 గంటల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది.

రివోల్ట్ ఆర్వీ1

రివోల్ట్ మోటార్స్ వారి ఆర్వీ1 బైక్ కేవలం రూ. 90,000(ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కి.మీ. దీనిని కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఈ మోటార్ సైకిల్ శక్తివంతమైన 2.8 kW మోటారుతో అమర్చబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, బ్యాటరీపై కంపెనీ 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీని అందిస్తోంది. ఛార్జర్‌పై 2 సంవత్సరాల వారంటీ కూడా ఉంది.

ఒబెన్ రోర్ ఈజెడ్

ఈ మోటార్ సైకిల్ 2.6 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీనికి 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ బ్యాటరీ వారంటీ ఉంది. దీనిని కేవలం 2 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది భారతదేశంలో రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ జెడ్

ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ జెడ్ బైక్ 3 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కి.మీ నడపవచ్చు. ఇది 3 గంటల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ధర రూ. 99,999(ఎక్స్-షోరూమ్). దీనికి మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, ముఖ్యంగా పెట్రోల్ ఖర్చు లేకపోవడం వల్ల డిమాండ్ పెరుగుతూ ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.