మిడిల్​ క్లాస్​ వారి కోసం అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..-best car for middle class check kia syros on road price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మిడిల్​ క్లాస్​ వారి కోసం అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

మిడిల్​ క్లాస్​ వారి కోసం అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 5 స్టార్​ రేటింగ్​ సాధించిన కియా సైరోస్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో కియా సైరోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా సైరోస్​

మిడిల్​ క్లాస్​ ప్రజలు సొంతంగా ఒక కారు కొనాలని కలలు ఉంటాయి. వాటి కోసం పోగు చేసి, మంచి కారు కొనాలని చూస్తుంటారు. మరి మీరు కూడా ఒక కారు కొనే ప్లాన్​లో ఉన్నారా? ఎస్​యూవీలను ప్రిఫర్​ చేస్తున్నారా? అయితే మీకు కియా మోటార్స్​ నుంచి ఇటీవలే వచ్చిన కియా సైరోస్​ మంచి ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్​యూవీకి మార్కెట్​లో డిమాండ్​ పెరుగుతోంది. కియా సోనెట్​, సెల్టోస్​ మధ్యలో ఉండే ఈ కియా సైరోస్​కి సంబంధించి లాంచ్​ సమయం నుంచి (మార్చ్​ చివరి నాటికి) 15,986 యూనిట్​లు అమ్ముడుపోవడం విశేషం. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో కియా సైరోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలపై ఇక్కడ ఓ లుక్కేయండి..

కియా సైరోస్​ - హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​..

కియా సైరోస్​ హెచ్​టీకే టర్బో పెట్రోల్​- రూ. 10.18 లక్షలు

హెచ్​టీకే ఆప్ట్​ టర్బో పెట్రోల్​- రూ. 11.30 లక్షలు

హెచ్​టీకే ఆప్ట్​ డీజిల్​- రూ .12.59 లక్షలు

హెచ్​టీకే ప్లస్​ టర్బో పెట్రోల్​- రూ.13.09 లక్షలు

హెచ్​టీకే ప్లస్​ టర్బో డీసీటీ- రూ. 14.55 లక్షలు

హెచ్​టీఎక్స్​ టర్బో పెట్రోల్​- రూ. 15.12 లక్షలు

హెచ్​టీకే​ ప్లస్​ డీజిల్​- రూ. 15.70 లక్షలు

హెచ్​టీఎక్స్​ డీజిల్​- రూ. 16.31 లక్షలు

హెచ్​టీఎక్స్​ టర్బో డీసీటీ- రూ. 16.58 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ టర్బో డీసీటీ- రూ. 18.16 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ డీజిల్​ ఏటీ- రూ. 19.36 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ ఆప్ట్​ టర్బో డీసీటీ పెట్రోల్​- రూ. 20.40 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ ఆప్ట్​ డీజల్​ ఏటీ- రూ. 21.68 లక్షలు

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే కియా సైరోస్​ ఎస్​యూవీ ​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

కియా సైరోస్​ 5 స్టార్​ రేటింగ్​..

కియా సైరోస్​ కొనేందుకు ఉన్న కారణాల్లో ఒకటి ఈ ఎస్​యూవీ సేఫ్టీ! భారత్ ఎన్​సీఏపీ కియా సైరోస్​ని క్రాష్ టెస్ట్ చేసింది. ఇది అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ), చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ) లలో 5-స్టార్ రేటింగ్​ని సాధించింది. సైరోస్ అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​ (ఏఓపీ) కోసం 32లో 30.21 స్కోరును చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​లో (సీఓపీ) కోసం 49 లో 44.42 స్కోరును సాధించింది. సైరోస్ హై-ఎండ్ హెచ్​టీఎక్స్+ పెట్రోల్-డీసీటీ, మిడ్-రేంజ్ హెచ్​టీకే (ఓ) పెట్రోల్-ఎంటీ వెర్షన్లను టెస్ట్​ చేశారు.

పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం