బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఇవి చూసేయండి-best camera smartphones under middle class budget oppo f25 pro to realme narzo 80 pro checkout list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఇవి చూసేయండి

బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఇవి చూసేయండి

Anand Sai HT Telugu

Best Camera Smart Phones : మీకు స్మార్ట్‌ఫోన్‌లలో ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైతే మీ కోసం అనేక రకాల ఫోన్లు ఉన్నాయి. రూ. 20,000లోపు ధరలో మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

మీరు ఫోటోగ్రఫీ కోసం ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకూడదని ఆలోచిస్తున్నారా? మీ కోసం మార్కెట్లో చాలా ఫోన్లు వెయిట్ చేస్తున్నాయి. మీకు రూ. 20,000 కంటే తక్కువ ధరకే మంచి ఆప్షన్స్ ఉన్నాయి. . వీటిలో రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్25 ప్రో, రియల్‌మీ పీ3 మొబైల్స్ ఈ బడ్జెట్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల గురించి సమాచారాన్ని చూద్దాం..

ఒప్పో ఎఫ్25 ప్రో

20,000 రూపాయల బడ్జెట్‌లో ఒప్పో ఎఫ్25 ప్రో స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక. ఇది ఓఐఎస్ సపోర్ట్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్ఈడీ డిస్‌ప్లేను 2412 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్ కలిగి ఉంది

రియల్‌మీ పీ3

రియల్‌మీ పీ3 మొబైల్ అనేది 20,000లోపు లభిస్తుంది. ఇది మంచి కెమెరాతో వస్తుంది. రియల్‌మీ పీ3 5జీ మొబైల్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతుతో వస్తుంది. రియల్‌మే పీ3 5జీ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అదనంగా రెండో కెమెరాలో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో

రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్ 6.67-అంగుళాల అమోల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,220 x 2,712 పిక్సెల్‌ల రిజల్యూషన్, 1,800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా హైపర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ

రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ ఇటీవలే లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 4500 నిట్‌ల ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఈ రియల్‌మే 5జీ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫాబ్రికేషన్లపై నిర్మించి ఉంటుంది. కెమెరా పరంగా రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ మొబైల్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరా ఉంది. ఇది ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తుంది. దీనికి 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. రూ.19,999 నుంచి ప్రారంభ ధర ఉంది.

గమనిక : ఈ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో వివిధ ఆఫర్ల కింద తక్కువ ధరలో దొరుకుతాయి.

Anand Sai

eMail