Best camera phones : మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఇవే ది బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్..
Best camera phones : రూ. 30వేల బడ్జెట్లో మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో 2024 నవంబర్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రూ.30 వేల లోపు ధరలో చాలా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్నింటిలో మాత్రమే బెస్ట్ కెమెరా సిస్టమ్ ఉంది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్‌లో కొనేందుకు ఉత్తమమైన మిడ్ రేంజ్, బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నవంబర్ 2024 లో రూ .30,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు..
1) వివో టీ3 అల్ట్రా:
వివో టీ3 అల్ట్రా 5జీ 6.78 ఇంచ్ 3 డి కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే 1.5 కే రిజల్యూషన్‌తో వస్తోంది. ఈ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెమ్పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వివో టీ3 అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
కెమెరా విషయానికొస్తే, వివో టీ3 అల్ట్రా వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించారు. తక్కువ లైటింగ్ పరిస్థితుల్లో మెరుగైన ఫోటోగ్రఫీ కోసం వివో సిగ్నేచర్ 'ఔరా రింగ్ లైట్' కూడా ఇందులో ఉంది.
2) రియల్మీ 13 ప్రో..
రియల్మీ 13 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 5జీ చిప్సెట్, 9 లేయర్ల 3డీ వీసీ కూలింగ్ సిస్టెమ్తో పనిచేస్తుంది.
రియల్మీ 13 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ ప్యూర్ బోకే, ఏఐ నేచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో వంటి అధునాతన ఏఐ ఫీచర్లను ఇందులో అందించారు.
3) మోటరోలా ఎడ్జ్ 50 ప్రో:
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి అడ్రినో 720 జీపీయూతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, స్మూత్ మల్టీ టాస్కింగ్, మెరుగైన పనితీరు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ ఎఫ్హెచ్ డీ+ పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 10 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది.
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అద్భుతమైన సెల్ఫీల కోసం రూపొందించడం జరిగింది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో నడిచే ఈ ఫోన్ టర్బో పవర్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కలిగి ఉంది.
సంబంధిత కథనం