Budget friendly smartphones : ధర రూ. 15వేల లోపే- కానీ ఫీచర్​ లోడెడ్​, బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..-best budget friendly smartphones under 15 000 in march 2025 vivo t4x poco m7 pro and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Friendly Smartphones : ధర రూ. 15వేల లోపే- కానీ ఫీచర్​ లోడెడ్​, బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Budget friendly smartphones : ధర రూ. 15వేల లోపే- కానీ ఫీచర్​ లోడెడ్​, బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Sharath Chitturi HT Telugu

Budget friendly smartphones : ఈ 2025 మార్చ్​లో రూ .15,000 లోపు బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ లిస్ట్​ చూసేయండి..

ఫీచర్​ లోడెడ్​, బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

ఈ రోజుల్లో ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​లో కూడా మంచి ఆప్షన్స్​ వస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరకే మంచి గ్యాడ్జెట్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మార్చ్​లో రూ. 15వేల లోపు ధరతో బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

మార్చ్​ 2025లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్​ఫోన్స్​:

1) వివో టీ4ఎక్స్..

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.72 ఇంచ్​ డిస్​ప్లేను ఈ స్మార్ట్​ఫోన్​ కలిగి ఉంది. ఈ డిస్​ప్లే 1050 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ని అందిస్తుంది. ఐ ప్రొటెక్షన్​ కోసం టీయూవీ రీన్లాండ్-సర్టిఫికేట్ పొందింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్​ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లైవ్ టెక్ట్స్​, సర్కిల్ టు సెర్చ్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్​లేషన్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది.

వివో టీ4ఎక్స్ 5జీ స్మార్ట్​ఫోన్​లో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అదనంగా, ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కి సపోర్ట్​ చేస్తుంది. 

2) ఇన్ఫీనిక్స్ నోట్ 40..

బడ్జెట్​ ఫ్రెండ్లీ ఇన్ఫీనిక్స్ నోట్ 40 స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, గ్రాఫిక్స్ సంబంధిత పనుల నిర్వహణ కోసం ఐఎంజీ బీఎక్స్ఎం-8-256 జీపీయూతో గ్యాడ్జెట్​ కనెక్ట్​ చేసి ఉంటుంది.

8 జీబీ వరకు ఎల్​పీపీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఇన్ఫీనిక్స్ సొంత ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్​తో 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్​డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఆప్టిక్స్ పరంగా, ఇన్ఫీనిక్స్ నోట్ 40 ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఇందులో ఓఐఎస్​తో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, మరో రెండు 2 మెగాపిక్సెల్ మాక్రో- డెప్త్ షూటర్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, బండిల్డ్ అడాప్టర్ ద్వారా 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్​లో ఉన్నాయి. 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

4) ఐక్యూ జెడ్9ఎక్స్..

6.72 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లేతో వస్తున్న ఐక్యూ జెడ్​9ఎక్స్​.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్​నెస్​ కలిగి ఉంది. క్వాల్కాం స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 4 జీబీ/8జీబీ/12జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్​తో ఈ ఫోన్ వస్తుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది.

పోకో ఎం7 ప్రో:

పోకో ఎం7 ప్రో స్మార్ట్​ఫోన్​ 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ సపోర్ట్ చేస్తుంది.

పోకో ఎం7 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత పోకో హైపర్ ఓఎస్​పై ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ పనిచేయనుంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్​లను కంపెనీ ఆఫర్ చేసింది.

50 మెగాపిక్సెల్ సోనీ లైటియా ఎల్​వైటీ-600 ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్​తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. హోల్ పంచ్ కటౌట్​లో ఉన్న ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ రిజల్యూషన్​ని కలిగి ఉంది.

45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,110 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

5) లావా బ్లేజ్ డుయో..

లావా బ్లేజ్ డుయోలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. లావా అగ్ని 3 మాదిరిగానే వెనుక భాగంలో 1.58 ఇంచ్​ సెకండరీ అమోఎల్ఈడీ డిస్​ప్లేను అందించారు.

బ్లేజ్ డ్యూయో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం ఐఎంజీ బీఎక్స్ఎం-8-256 గ్రాఫిక్స్ ప్రాసెసర్​ని జత చేశారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 మెమొరీ, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఈ ఫోన్​లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.

మీరు ఏ ఫోన్ కొనాలి?

6,400 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వివో టీ4ఎక్స్ ఈ కేటగిరీలోకి కొత్తగా ప్రవేశించింది.

అయితే మీరు అమోఎల్ఈడీ ప్యానెల్​ని ఇష్టపడితే, డ్యూయల్ అమోలెడ్ డిస్​ప్లేలు, క్లీన్ సాఫ్ట్​వేర్​ అనుభవంతో లావా బ్లేజ్ డుయో కూడా మంచి ఆప్షన్​.

ఈ ధర పరిధిలో పెద్ద బ్యాటరీ లైఫ్ ఉన్న మరొక ఫోన్ ఐక్యూ జెడ్9ఎక్స్, అయితే ఇది కాలం చెల్లిన స్నాప్​డ్రాగన్​ 6 జెన్ 1 ప్రాసెసర్​తో వస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం