జీవితంలో ఒక ఇల్లు కొనాలని, సొంతంగా ఒక కారు కొనుక్కోవాలని మిడిల్ క్లాస్ ప్రజలు కలలు కంటూ ఉంటారు. కలలను నెరవేర్చేందుకు సంవత్సరాల తరబడి సేవింగ్స్ చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఆటోమొబైల్ సంస్థలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 5లక్షలు, అంతకన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని కార్ల వివరాలను ఇప్పుడు మేము మీకు చెబుతాము. ధర రూ. 5లక్షలే అని తక్కువ చేసి చూసే విధంగా ఇవి అస్సలు ఉండవు! మార్కెట్లో వీటికి మంచి సేల్స్ ఉన్నాయి.
టాటా టియాగో- టాటా మోటార్స్ నుంచి వచ్చిన అఫార్డిబుల్ కార్స్లో ఈ టాటా టియాగో ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 10ఏళ్లుగా ఇది మార్కెట్లో ఉంది. టాటా టియాగో ప్రారంభ ధర రూ. 4.99లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ రూ. 8.45 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1199 సీసీ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ, పెట్రోల్ వేరియంట్స్‌లో ఇది అందుబాటులో ఉంది. టాటా టియాగో 19 కేఎంపీఎల్ నుంచి 20 కేఎంపీఎల్ వరకు మైలేజ్‌ని ఇస్తుంది. చిన్నగా ఉండటంతో టియాగో పార్కింగ్‌కి కూడా ఎక్కువ స్పేస్ అవసరం ఉండదు.
మారుతీ ఆల్టో కే10- చిన్న వాహనాలకు పెట్టింది పేరుగా ఉన్న మారుతీ సుజుకీ సంస్థలో మారుతీ ఆల్టో కే10కి సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉందనే చెప్పుకోవాలి. 15 సంవత్సరాలు గడుస్తున్నా, ఈ మోడల్‌కి డిమాండ్ తగ్గలేదు. ఈ చిన్న కారు ప్రారంభ ధర రూ. 4.23 లక్షలు. టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 6.2లక్షల వరకు ఉంటుంది. ఇందులో 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పైగా అన్ని వేరియంట్స్‌కి సేఫ్టీని పెంచుతూ, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా ఇస్తున్నట్టు సంస్థ గత నెలలోనే ప్రకటించింది.
రెనాల్ట్ క్విడ్- ఇండియాలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా రెనాల్ట్ క్విడ్‌కి మంచి గుర్తింపు ఉంది. రెనాల్ట్‌కి ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఇదొకటి. ఇందులో 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 4.70లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.45లక్షల వరకు ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ 21.5- 22.3 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో:- మారుతీ సుజుకీ నుంచి వచ్చిన మరో చిన్న కారు ఈ ఎస్-ప్రెస్సో. దీని ప్రారంభ ధర రూ. 4.2లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.12లక్షల వరకు ఉంటుంది. ఇందులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ మోడల్ 24- 25.3 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది.
* పైన చెప్పినవి ఎక్స్‌షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్‌రోడ్ ప్రైజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా కారుకు ఎక్స్‌షోరూం ధరలను సంస్థ చెబుతుంది. ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలతో పాటు ఆఫర్స్, డిస్కౌంట్స్‌పై క్లారిటీ వస్తుంది. అవి తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకుంటే బెస్ట్. షోరూమ్‌కి వెళితే వెహికిల్‌ని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు.
ధర రూ. 5లక్షలు కాబట్టి చాలా వరకు ఎంట్రీ లెవల్ వేరియంట్లు వస్తాయి. హై- ఎండ్‌లో వచ్చే అనేక ఫీచర్స్ ఇందులో ఉండకపోవచ్చు. కాగా, కంఫర్ట్ కన్నా, ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న మోడల్స్‌ని ఎంచుకోవడం బెటర్!
సంబంధిత కథనం