Automatic cars under 15 lakhs : ట్రాఫిక్​లో డ్రైవింగ్​ అంటే చిరాక? ఈ ఆటోమెటిక్​ కార్లు బెస్ట్​!-best automatic gear cars under 15 lakhs you should consider tata punch xuv 3xo and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Automatic Cars Under 15 Lakhs : ట్రాఫిక్​లో డ్రైవింగ్​ అంటే చిరాక? ఈ ఆటోమెటిక్​ కార్లు బెస్ట్​!

Automatic cars under 15 lakhs : ట్రాఫిక్​లో డ్రైవింగ్​ అంటే చిరాక? ఈ ఆటోమెటిక్​ కార్లు బెస్ట్​!

Sharath Chitturi HT Telugu

Best automatic cars under 15 lakhs : మీరు కొత్త ఆటోమెటిక్​ కారు కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్​ రూ. 15లక్షల అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ ప్రైజ్​ పాయింట్​లో బెస్ట్​ ఆటోమెటిక్​ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

15లక్షల బడ్జెట్​లో ఈ ఆటోమెటిక్​ కార్లు బెస్ట్​..

బెంగళూరు ఒక్కటే కాదు హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ట్రాఫిక్​ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ట్రాఫిక్​లో డ్రైవింగ్​ అంటే చాలా మందికి చిరాకుగా ఉంటోంది. ఇలాంటిప్పుడే ఆటోమెటిక్​ గేర్​ కార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మాటిమాటికి గేర్లు మార్చే అవసరమే లేకుండా, పెద్దగా కష్టపడకుండా డ్రైవింగ్​ చేసేయొచ్చు. మరి మీరు కొత్త ఆటోమెటిక్​ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 15లక్షల ధరలోపు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఆటోమెటిక్​ కార్ల వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

ఆటోమెటిక్​ కార్లలో ఇవి బెస్ట్​!

మహీంద్రా థార్​- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన మహీంద్రా థార్​ ధర రూ. 11.50లక్షల నుంచి రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది. అయితే, థార్​ ఎల్​ఎక్స్​ హార్డ్​ టాప్​ ఏటీ ఆర్​డబ్ల్యూ వేరియంట్​ ఆటోమెటిక్​ ఆప్షన్​లో బెస్ట్​! దీని ధర రూ .14.25 లక్షలు. ఇందులో 1997 సీసీ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది.

హ్యుందాయ్​ క్రెటా- ఇండియాలో టాప్​ మోడల్​ ఈ హ్యుందాయ్​ క్రెటా. దీని ధర రూ.11లక్షల నుంచి రూ. 20.5లక్షల వరకు ఉంటుంది. కాగా, ఆటోమెటిక్​ ఆప్షన్​లో హ్యుందాయ్​ క్రెటా ఎక్స్​(ఓ) ఐవీటీ మంచి ఛాయిస్​ అవుతుంది. దీని ధర రూ. 14.37లక్షలు. ఇందులో 1497 సీసీ ఇంజిన్​ ఉంటుంది. 17.7 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంది.

టాటా కర్వ్​- రీసెంట్​గా లాంచ్​ అయిన మోడల్స్​లో ఈ టాటా కర్వ్​ ఎస్​యూవీ కూపే ఒకటి. దీని ధర రూ. 10లక్షల నుంచి రూ. 19.20లక్షల వరకు ఉంటుంది. ఇందులో 13.87లక్షల నుంచి 14.8లక్షల వరకు మధ్యలో ఆటోమెటిక్​ గేర్​ బాక్స్​ వేరియంట్లు​ ఉన్నాయి. ఇవి 11 కేఎంపీఎల్​ నుంచి 13కేఎంపీఎల్​ వరకు మేలేజ్​ ఇస్తాయి.

టాటా పంచ్​- టాటా మోటార్స్​కి బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటి ఈ టాటా పంచ్​. దీని ధర రూ. 6.2లక్షల నుంచి రూ. 10.32లక్షల వరకు ఉంటుంది. టాటా పంచ్​ క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ ఏఎంటీ, టాటా పంచ్​ క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ కామో ఏఎంటీలు బెస్ట్​ ఛాయిస్​ అవుతాయి. వీటి ధరలు రూ. 10.15లక్షలు- రూ. 10.32లక్షల మధ్యలో ఉంటాయి. ఇవి 19కేఎంపీఎల్​ వరకు మైలేజ్​ని ఇస్తాయి.

టాటా నెక్సాన్​- బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల్లో టాటా నెక్సాన్​ గురించి మాట్లాడకపోతే ఎలా? ఈ ఎస్​యూవీ ధర రూ. 8.1లక్షల నుంచి రూ. 15.60లక్షల వరకు ఉంటుంది. కాగా రూ.10.40 లక్షల నుంచి రూ. 14.80లక్షల వరకు ఆటోమెటిక్​ గేర్​ బాక్స్​ ఆప్షన్స్​ చాలా ఉన్నాయి. ఇవి 17 కేఎంపీఎల్​ నుంచి 24కేఎంపీఎల్​ వరకు మైలేజ్​ని ఇస్తాయి.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​- ఫ్రాంక్స్​ ధర రూ. 7.5లక్షల నుంచి రూ. 13.04లక్షల వరకు ఉంటుంది. కాగా ఫ్రాంక్స్​ జెటా టర్పో ఏటీ, ఆల్ఫా టర్బో ఏటీ, ఆల్ఫా టర్బో ఏటీ గుడ్​ ఛాయిస్​ అవుతాయి. వీటి ధరలు రూ. 11.9లక్షల నుంచి రూ. 13లక్షల వరకు ఉంటాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ- ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​గా వచ్చిన ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ధర రూ. 7.99లక్షల నుంచి రూ. 15.56లక్షల వరకు ఉంటుంది. రూ. 10.39లక్షల నుంచి ఆటోమెటిక్​ గేర్​ బాక్స్​ ఆప్షన్స్​ మొదలవుతాయి.

పైన చెప్పినవి ఆన్​రోడ్​ ప్రైజ్​ కాదు, ఎక్స్​షోరూం ధర అని గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శిస్తే, ఆయా వాహనాలపై డిస్కౌంట్స్​, ఆఫర్స్​ గురించి తెలుసుకుని బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు. టెస్ట్​ డ్రైవ్​ కూడా చేయవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం