Best 7 Seater Cars : ఫ్యామిలీకి సూట్ అయ్యే బెస్ట్ 7 సీటర్ కార్లు.. ఇందులో మీక ఏది నచ్చుతుంది?
Best 7 Seater Cars : మీరు 7 సీటర్ కారు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం మార్కెట్‌లో అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కిందివాటిలో మీకు ఏ కారు నచ్చుతుందో చూడండి..

భారతదేశంలోని కారు కొనే కస్టమర్ ముందుగా చూసేది.. బడ్జెట్, మైలేజ్, విశ్వసనీయత. కస్టమర్ల డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా టాప్ కంపెనీలు 7 సీటర్ కార్లలో మంచి మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. మైలేజీ కూడా బాగుంటుంది. అలాంటి కార్లు కొన్ని ఉన్నాయి. మీకు నచ్చే 7 సీటర్ కారు ఇందులో ఏది ఉందో సెలెక్ట్ చేసుకోండి.
టాటా సఫారీ
టాటా సఫారీ రూ.15.50 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 27 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. సఫారీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక డీజిల్ ఇంజన్ హెక్టర్‌తో పంచుకున్న 2.0-లీటర్ మోడల్. కస్టమర్లు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మధ్య ఎంచుకోవచ్చు.
మారుతి ఇన్విక్టో
మారుతి కంపెనీకి చెందిన ప్రీమియం 7 సీటర్ ఇన్విక్టో లీటరుకు 23.24 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు ఫ్యామిలీకి సరైన కారు. మీరు ప్రీమియం మారుతి సుజుకి ఇన్విక్టో కారు కొనాలనుకుంటే ధర రూ. 25.51 లక్షల నుండి రూ. 29.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మారుతి నుండి రెండు ఇన్విక్టో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి జీటాప్లస్ మరియు ఆల్ఫాప్లస్. ఇందులో 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్
టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ.19.94 లక్షల నుండి రూ.31.34 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్). ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్లతో వస్తుంది. ఇది ఆరు వేర్వేరు వెర్షన్లలో ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే.. దీని హైబ్రిడ్ సిస్టమ్ 23.24 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది.
ఎంజీ హెక్టర్ ప్లస్
ఎంజీ హెక్టర్ ప్లస్ ధర రూ. 17.50 లక్షల నుండి రూ. 23.67 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. డీజిల్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు రెండింటిలోనూ లభిస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా వస్తాయి. పెట్రోల్ ఇంజన్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత అయి ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700
మహీంద్రా ఎక్స్‌యూవీ700 భారతీయ కార్ల పరిశ్రమలో అత్యుత్తమ ఎస్‌యూవీలలో ఒకటి. ధరలు రూ.13.99 లక్షల నుండి రూ.24.99 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. 5-సీటర్, 7-సీటర్ రెండూ దొరుకుతాయి. మహీంద్రా పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
హ్యుందాయ్ అల్కాజార్
హ్యుందాయ్ అల్కాజార్ ధర రూ. 14.99 లక్షల నుండి రూ. 21.70 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అల్కాజార్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, డీజిల్ ఇంజిన్ కోసం టార్క్ కన్వర్టర్, పెట్రోల్ ఇంజిన్ కోసం డీసీడీ యూనిట్‌ను ఎంచుకోవచ్చు. 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్‌లలో లభిస్తుంది.
సంబంధిత కథనం