Best 7 seater car : ఫ్యామిలీ కోసం 7 సీటర్ కార్ కొనాలా? ఇండియాలో ఇదే బెస్ట్- ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Maruti Suzuki Ertiga on road price Hyderabad : మారుతీ సుజుకీ ఎర్టిగా 7 సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఫ్యామిలీ కోసం మంచి 7 సీటర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు మారుతీ సుజుకీ ఎర్టిగా గురించి తెలుసుకోవాల్సిందే! దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్స్లో ఈ ఎర్టిగా ఒకటి. 2012లో లాంచ్ అయినప్పటి ఇప్పటి ఈ మోడల్‌కి సంబంధించిన 10లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా 7 సీటర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా ఆన్‌రోడ్ ప్రైజ్..
మారుతీ సుజుకీ ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (ఓ) పెట్రోల్- రూ. 10.69 లక్షలు
వీఎక్స్ఐ (ఓ) పెట్రోల్- రూ. 12.07 లక్షలు
వీఎక్స్ఐ (ఓ) సీఎన్జీ- రూ. 13.65 లక్షలు
జెడ్ఎక్స్ఐ (ఓ) పెట్రోల్- రూ. 13.83 లక్షలు
వీఎక్స్ఐ ఏటీ పెట్రోల్- రూ. 14.21 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్- రూ. 14.70 లక్షలు
జెడ్ఎక్స్ఐ (ఓ) సీఎన్జీ- రూ. 15.03 లక్షలు
జెడ్ఎక్స్ఐ ఏటీ పెట్రోల్- రూ. 15.58 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ (పెట్రోల్)- రూ. 16.45 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 10.69 లక్షల నుంచి రూ. 16.45 లక్షల వరకు ఉంటుంది. వీటిల్లో వీఎక్స్ఐ (ఓ) సీఎన్జీ, జెడ్ఎక్స్ఐ (ఓ) పెట్రోల్ వేరియంట్లు బెస్ట్ సెల్లింగ్‌గా కొనసాగుతున్నాయి. ఎర్టిగాలో డీజిల్ వేరియంట్లు లేవు.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే మారుతీ సుజుకీ ఎర్టిగా 7 సీటర్ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
బెస్ట్ 7 సీటర్ కారు- ఇంజిన్ వివరాలు..
మారుతీ సుజుకీ ఎర్టిగాలో కే-సిరీస్ 1.5-లీటర్ డ్యూయెల్ వీవీటి ఇంజిన్ ఉంటుంది. ఇది ఎమ్‌పీవీ అందించే ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది సుపరిచితమైన 5-స్పీడ్ గేర్ బాక్స్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. 6-స్పీడ్ ఆటోమెటిక్ యూనిట్ కూడా ఉంది. ఈ మోడల్లో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం