Stock Market : అదృష్టమంటే ఈమెదే.. తాత చేసిన పనికి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మనవరాలు-bengaluru woman become crorepati overnight because of her late grandfathers stock investments ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : అదృష్టమంటే ఈమెదే.. తాత చేసిన పనికి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మనవరాలు

Stock Market : అదృష్టమంటే ఈమెదే.. తాత చేసిన పనికి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మనవరాలు

Anand Sai HT Telugu

Stock Market : ఓ మహిళ ఊహించని విధంగా కోటీశ్వరురాలైంది. తన తాత ఎప్పుడో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు అవి పెరిగి చాలా డబ్బులు అయ్యాయి.

స్టాక్ మార్కెట్

2020లో కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఉండడం కచ్చితమైపోయింది. కానీ ఈ సమయంలో ఓ మహిళ జీవితం మారిపోయింది. తాత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి మరిచిపోయిన పెట్టుబడులు రావడంతో ప్రియా శర్మ అనే మహిళ ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది.

2004లో ఆమె తాత లార్సెన్ అండ్ టూబ్రో (Lఅండ్ T) 500 షేర్లను కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడులు చాలా సంవత్సరాలు మరచిపోయారు. కాలక్రమేణా స్టాక్స్ విలువ పెరిగింది. చివరికి ప్రియ జీవితాన్ని మార్చేసింది.

ఫస్ట్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రియకి వారసత్వంగా 500 ఎల్ అండ్ టి షేర్లు వచ్చాయి. ఇప్పుడు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఫలితంగా 4,500 షేర్లకు వెళ్లాయి. నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కంపెనీ మరింత షేర్లను జారీ చేసినప్పుడు స్టాక్ స్ప్లిట్ ఏర్పడుతుంది. ఉదాహరణకు 1:2 స్ప్లిట్‌లో ప్రతి షేరు సగానికి విభజించడం అన్నమాట. తద్వారా పెట్టుబడి విలువ అలానే ఉంటుంది.. కానీ వాటా సంఖ్య రెట్టింపు అవుతుంది.

ప్రియా దాదాపు రూ.1.72 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నట్లు అంచనా. అయితే దీర్ఘకాలంగా మరచిపోయిన ఈ ఇన్వెస్ట్‌మెంట్ తిరిగి పొందడం అంత సులభం కాదు. బెంగుళూరులో ఉంటున్న ప్రియా, తన తాతగారి పత్రాలను పొందడానికి, ముంబై విచారణ ప్రక్రియను ప్రారంభించడానికి అనేక విషయాలను దాటాలి. L అండ్ Tకి లేఖ రాయడం ద్వారా ప్రక్రియను ప్రారంభించింది ప్రియా.

ప్రియా తాతయ్య వీలునామాతో సహా పత్రాలను కంపెనీ పరిశీలించింది. షేర్‌ల సంఖ్య గణనీయంగా ఉండటం, క్లయింట్‌కు అసలు వాటాలు లేనందున, కంపెనీ అనేక తనిఖీలు చేయాల్సి వస్తుందని కంపెనీ పేర్కొంది. వీలునామాపై తదుపరి పరిశీలన కూడా చేయాల్సి ఉంటుంది.