టెక్ పరిశ్రమలో కొనసాగుతున్న లేఆఫ్స్ వ్యవహారం.. బెంగళూరులోని నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్‌ని ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఉద్యోగ కోతలు కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని, మార్కెట్ విశ్వాసాన్ని తగ్గించాయని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.
నగరంలో ఒక వైద్య వ్యవస్థాపక సంస్థలో పనిచేస్తున్న 40 ఏళ్ల సురేష్ గౌడ (పేరు మార్చడం జరిగింది) ఇల్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే, ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అతను తన ప్లాన్స్‌ని వాయిదా వేసి, ఇప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడంపై దృష్టి సారించాడు. రియల్ ఎస్టేట్ మినహ స్టాక్‌లు, ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం గురించి కూడా ఆలోచిస్తున్నాడు.
ఇంటి కొనుగోలుదారులు, అద్దెదారులు మాత్రమే కాదు, యజమానులు కూడా తాజా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. బెంగళూరులోని చాలా మంది ఇంటి యజమానులు టెక్ రంగంలోని అద్దెదారులకు లీజు పునరుద్ధరణలను పునరాలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న అనిశ్చితి మధ్య ప్రామాణిక 11 నెలల కాలం తర్వాత ఒప్పందాలను పొడిగించాలా? వద్దా? అని చాలా మంది చర్చించుకుంటున్నారట.
"ఈరోజు బెంగళూరులో, ఇంటి యజమానులు అద్దెదారుల గురించి, ముఖ్యంగా టెక్ రంగం నుంచి వచ్చే వారి గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 11 నెలల అద్దె కాలం ముగిసినప్పుడు ఇంటి యజమానులు టెకీలతో ఒప్పందాలను పునరుద్ధరించాలా వద్దా అనే దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి," అని హను రెడ్డి రియల్టీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ అన్నారు.
“కొన్ని సందర్భాల్లో, అద్దెదారులు ఇబ్బంది పడుతున్నారు. వారు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అద్దెను నిర్వహించలేకపోతున్నారు. ఈ రకమైన చర్చలు ఇప్పుడు సాధారణం, ముఖ్యంగా మారతహళ్లి - మన్యత టెక్ పార్క్ సమీపంలోని ప్రాంతాల్లో,” అని ఆయన అన్నారు.
ప్రపంచ ఎంఎన్‌సీలు 2025లో ఇప్పటికే భారీ ఉద్యోగ కోతలను ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ఆందోళనకరంగా మారాయి.
మీడియా నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాల తర్వాత, 305 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే కొత్త రౌండ్ లేఆఫ్స్‌ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. "డైనమిక్ మార్కెట్‌ప్లేస్‌లో కంపెనీని విజయవంతంగా ఉంచడానికి అవసరమైన సంస్థాగత మార్పులు ఇవి," అని తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
వెస్టియన్ రీసెర్చ్ ప్రకారం.. 2024లో నగరంలో మొత్తం రియల్ ఎస్టేట్ లీజింగ్‌లో Iటీ-Iటీఈఎస్ రంగం 40% వాటాను కలిగి ఉంది. ఇది టెక్ పరిశ్రమపై బెంగళూరు ఎంతమేర ఆధారపడి ఉందో సూచిస్తుంది. ప్రపంచ టెక్ సంస్థలు ఉద్యోగ కోతలను ప్రకటిస్తూనే ఉండటంతో, నియామకాల్లో తగ్గుదల- ఉద్యోగ నష్టాలు గృహ కొనుగోలు, అద్దె డిమాండ్‌ను ఆలస్యం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
బెంగళూరు టెక్ పరిశ్రమకు విద్య, బలమైన ప్రతిభావంతుల పూల్, రియల్ ఎస్టేట్ రంగానికి విస్తృత అవకాశాలతో కూడిన సమగ్ర పర్యావరణ వ్యవస్థను అందిస్తుందని వారు చెబుతున్నారు.
"బెంగళూరులోని చాలా మంది రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు జీతం పొందే నిపుణులు, గణనీయమైన సంఖ్యలో గృహ రుణాలపై ఆధారపడతారు. మెజారిటీ ఐటి కంపెనీలలో లేదా టెక్ పరిశ్రమకు మద్దతు ఇచ్చే పాత్రలలో పనిచేస్తున్నారు. అపార్ట్‌మెంట్ ధరలు పెరగడం కొనసాగుతున్నందున, సీఎక్స్ఓలు, వ్యాపార నిపుణుల నుంచి, ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి సంబంధించిన వారి నుంచి పెరుగుతున్న ఆసక్తిని కూడా మేము చూస్తున్నాము," అని క్రెడాయ్ బెంగళూరు అధ్యక్షుడు జాయద్ నోమాన్ గతంలో HT.com కి చెప్పారు.
ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు పెరుగుతున్న ఆదరణ టెక్ పరిశ్రమను పునరాకృతి చేస్తోందని, కొన్ని పాత్రలకు డిమాండ్‌ను మారుస్తోందని, ఉద్యోగ మార్కెట్‌లో మార్పులను కలిగిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని రంగాలలో వృద్ధి మందగిస్తున్నప్పటికీ, అధునాతన టెక్ రంగాలలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.
"ఉద్యోగ అనిశ్చితి నెలకొన్నందున, గృహ కొనుగోలుదారుల మొత్తం నిర్ణయం తీసుకునే చక్రం పెరిగింది. వారు తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. ఇది వారు కొంత జాగ్రత్తగా ఉన్నారని చూపిస్తుంది," అని ANAROCK గ్రూప్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక కపూర్ HT.com కి చెప్పారు.
"రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది. కొనుగోలుదారులు తమ ఆర్థిక విషయాలను నిశితంగా విశ్లేషించి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలానికే," అని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు అన్నారు.
బెంగళూరులో గత కొన్ని నెలలుగా అద్దె రేట్లు గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయని కుమార్ అన్నారు.
"బెంగళూరు తూర్పు, ఉత్తరం వైపున ఉన్న టెక్ కారిడార్ల సమీపంలోని అధిక వృద్ధి ప్రాంతాలలో, అద్దె గణనీయంగా పెరగలేదు. మారతహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్ వంటి ప్రదేశాలలో అద్దె విచారణలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో గత సంవత్సరం అద్దెలు 15-20% పెరిగినప్పటికీ, ఈ సంవత్సరం పెరుగుదల చాలా తక్కువ, సుమారు 7-8%," అని చెప్పుకొచ్చారు.
"గత 3-4 సంవత్సరాల బుల్ రన్ తర్వాత మార్కెట్ స్టెబులైజ్ అవుతున్నందున, ధర దిద్దుబాటు ఆశించవచ్చు," అని ఇండియాసెట్జ్ మార్కెటింగ్ ఏవీపీ రాఘవేంద్ర రావు అన్నారు.
2023 నుంచి, కోరమంగళ, సర్జాపూర్ రోడ్, వైట్‌ఫీల్డ్, బెల్లందూర్ వంటి ప్రముఖ అద్దె కేంద్రాల్లో రెంట్లు సంవత్సరానికి 20-35% వరకు పెరిగాయి.
"ఇప్పుడు, ఇంటి యజమానులు అద్దె అంచనాలపై మరింత సరళంగా మారుతున్నారు. ముఖ్యంగా సబర్బన్ ప్రాంతాలలో, సరఫరా పెరిగింది. జీతాల వృద్ధి స్తంభించిపోవడంతో అద్దెదారులు మరింత ఖర్చుపై దృష్టి సారిస్తున్నారు," అని రావు పేర్కొన్నారు.
మొత్తం మీద, బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్వల్పకాలిక దిద్దుబాటు.. ధరలు, అద్దెలపై ప్రభావం చూపినప్పటికీ, నగరం ప్రధాన టెక్, వ్యాపార కేంద్రంగా కొనసాగుతున్నందున దీర్ఘకాలిక ప్రాథమిక అంశాలు బలంగానే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం