Epic Electric Scooter : మంచి మైలేజీతో సింపుల్ లుక్‌లో ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటీ.. సిటీలో తిరిగేందుకు బెటర్
Epic Electric Scooter : ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. చాలా మంది వీటివైపు మెుగ్గుచూపుతున్నారు. దీంతో పెట్రోల్ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. అయితే సిటీలో తిరిగేందుకు కొన్ని రకాల స్కూటీలు కంఫర్టబుల్‌గా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటీ.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ BattRE ఇటీవలే స్టోరీ ఎపిక్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీపైనే ఇస్తుంది. రోజువారీ సిటీ ప్రయాణానికి ఇది బెస్ట్ స్కూటర్. ఈ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కి.మీగా వెళ్తుంది. కంపెనీ తన బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీని అందిస్తోంది. స్కూటర్ గురించిన మరిన్ని వివరాలు చూడండి..
ధర ఎంతంటే
స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.84,999(ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌లోని 60V 40Ah బ్యాటరీ ప్యాక్ IP67-రేటెడ్‌ను కలిగి ఉంది. ఇది దుమ్ము, నీటి నుంచి రక్షణగా ఉంటుంది. స్కూటర్‌లో అమర్చిన బ్యాటరీ ఎక్కువ భద్రత కోసం లిథియం-అయాన్ బ్యాటరీ. బ్యాటరీ ప్యాక్ కూడా వేరు చేయగలదు. కస్టమర్‌లు ఎలక్ట్రిక్ సాకెట్ లేకపోయినా పార్కింగ్ స్థలంలో ఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్యాటరీని మాత్రమే తీసుకువెళ్లీ ఛార్జ్ చేయవచ్చు. ఇందులో అందించబడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దూరం, బ్యాటరీ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సమయం వంటి సమాచారాన్ని చూపిసతుంది. స్కూటర్ బాడీ మెటల్‌తో తయారు చేశారు. బ్యాటరీ ప్యాక్‌ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
అందుబాటులో ఈ కలర్స్
కొత్త స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, క్యాండీ రెడ్, స్టార్‌లైట్ బ్లూ, ఐస్ బ్లూ, పెరల్ వైట్, కాస్మిక్ బ్లూ, గన్‌మెటల్, బ్లేజింగ్ బ్రాంజ్, హంటర్ గ్రీన్ బ్లాక్, గోల్డ్ రష్ వంటి 12 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
స్టోరీ ఎపిక్‌ని మార్కెట్‌కి పరిచయం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నామమని BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు నిశ్చల్ చౌదరి చెప్పుకొచ్చారు. ఎకో-ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా ఆచరణాత్మకమైన, నమ్మదగిన ప్రయాణాన్ని అందించే ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయాలనే నిబద్ధతకు ఈ స్కూటర్ నిదర్శనమన్నారు.
భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, పెట్రోల్‌తో నడిచే వాహనాల నిర్వహణ ఖర్చుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఎక్కువ అవుతున్నాయి. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్లోకి వచ్చింది.