మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- సింగిల్​ ఛార్జ్​తో 90కి.మీ రేంజ్​, ధర కూడా తక్కువే-battre loev electric scooter with upto 90 km of range launched check price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- సింగిల్​ ఛార్జ్​తో 90కి.మీ రేంజ్​, ధర కూడా తక్కువే

మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- సింగిల్​ ఛార్జ్​తో 90కి.మీ రేంజ్​, ధర కూడా తక్కువే

Sharath Chitturi HT Telugu
Published Feb 19, 2025 10:33 AM IST

BattRE LOEV+ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇది హై స్పీడ్​, హై పర్ఫార్మెన్స్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

BattRE LOEV+ ఎలక్ట్రిక్​ స్కూటర్ ఇదే!
BattRE LOEV+ ఎలక్ట్రిక్​ స్కూటర్ ఇదే!

BattRE ​ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ని లాంచ్​ చేసింది చేసింది. దీనిపేరు BattRE LOEV+. ఈ ఈ-స్కూటర్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.69,999 మాత్రమే! ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అధీకృత డీలర్​షిప్​ల వద్ద అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

BattRE నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

BattRE LOEV+ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మూడు రైడింగ్ మోడ్​లు ఉన్నాయి. అవి.. ఎకో మోడ్ (35 కిమీ/హెచ్​ టాప్ స్పీడ్, 90 కిలోమీటర్ల రేంజ్), కంఫర్ట్ మోడ్ (48 కి.మీ/హెచ్​ టాప్ స్పీడ్, 75 కి.మీ రేంజ్), స్పోర్ట్స్ మోడ్ (60 కి.మీ/హెచ్​ టాప్​ స్పీడ్, 60 కి.మీ రేంజ్). ఈ స్కూటర్లలో ఇన్ఫర్మేటివ్ స్పీడోమీటర్ ద్వారా స్మార్ట్ కనెక్టివిటీ ఉంది. ఇది డిస్టెన్స్​ టు ఎంప్టీ (డీటీఈ), స్టేట్ ఆఫ్ ఛార్జ్ (ఎస్ఓసి) వంటి కీలక వివరాలను ప్రదర్శిస్తుంది. BattRE LOEV+ గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం.

ఈ BattRE LOEV+ లో 2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. 13ఏఎంపీ ఛార్జర్​ ఉంటుంది. ఈ రెండు కూడా ఐపీ67 రేటెడ్​ వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​కి కలిగి ఉన్నాయి. లాంగ్​ లాస్టింగ్​ పర్ఫర్మెన్స్​ కోసం ఈ బ్యాటరీ ప్రీమియం 21700 సెల్స్​ని ఉపయోగిస్తుంది.

BattRE LOEV+ ఫీచర్లు ఇలా..

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్యాన్ ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పార్కింగ్ మోడ్, 12-ఇంచ్​ అల్లాయ్ వీల్స్, కంబైన్డ్ డిస్క్ బ్రేక్ సిస్టెమ్, సారీ గార్డ్​ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఈ-స్కూటర్​ 5 రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. అవి.. స్టార్​లైట్​ బ్లూ, స్టార్మీ గ్రే, ఐస్​ బ్లూ, మిడ్​నైట్​ బ్లాక్​, పర్ల్​ వైట్​.

"ఇది దేశంలో అత్యంత సరసమైన హై-స్పీడ్ స్కూటర్ మాత్రమే కాదు, అమరాన్ నుంచి అత్యంత అధునాతన బ్యాటరీతో నడిచే అత్యంత ఫీచర్-ప్యాక్డ్ స్కూటర్లలో ఒకటి," అని BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ- మేనేజింగ్ డైరెక్టర్ నిశ్చల్ చౌదరి అన్నారు. ఈ స్కూటర్ పట్టణ ప్రయాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, టాప్-టైర్ పనితీరు, భద్రత, డిజైన్​ని మేళవించి రూపొందించినట్టు వివరించారు. సుస్థిర మొబిలిటీ దిశగా పరివర్తన చెందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్​ స్కూటర్స్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​, బెస్ట్​ ఆప్షన్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం