Bansal Wire IPO: బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ కోసం జూలై 3వ తేదీన ఓపెన్ అయింది. బిడ్డింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పూర్తిగా సబ్ స్క్రైబ్ అయింది. ఇది కంపెనీపై రిటైలర్ల కు ఉన్న ఆసక్తిని వ్యక్తం చేస్తోంది. బీఎస్ఈ డేటా ప్రకారం, బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్ జూలై 3 సాయంత్రం 4:00 గంటలకు 1.54 రెట్లుగా ఉంది. 2,14,60,906 షేర్లకు గాను 3,31,01,354 షేర్లకు బిడ్లు వచ్చాయని బీఎస్ఈ (BSE) గణాంకాలు చెబుతున్నాయి.
బన్సల్ వైర్ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 2.26 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా (NII) 1.91 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యాయి. బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ పబ్లిక్ ఇష్యూలో 50 శాతానికి మించకుండా వాటాలను క్యూఐబీకి, 15 శాతానికి తగ్గకుండా ఎన్ఐఐకి, 35 శాతానికి తగ్గకుండా రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసింది.
జూలై 3న ప్రారంభమైన ఈ బన్సల్ వైర్ ఐపీఓ (IPO) జూలై 5వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. ఇందులో రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.243 నుంచి రూ.256 వరకు నిర్ణయించారు. ఒక్కో లాట్ లో 58 ఈక్విటీ షేర్లు ఉంటాయి. అంటే, ఒక్కో లాట్ కు గరిష్టంగా రూ. 14,848 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బన్సల్ వైర్ ఐపీఓ (Bansal Wire IPO) షేర్స్ అలాట్మెంట్ జూలై 8వ తేదీన, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ జూలై 10వ తేదీన ఉండవచ్చు.
బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉక్కు తీగను ఉత్పత్తి చేసే సంస్థ. బన్సల్ వైర్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థ బన్సాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 3,000కు పైగా స్టాక్ కీపింగ్ యూనిట్లను (ఎస్కేయూ) అందిస్తున్నాయి. కార్పొరేషన్ నుంచి సుమారు 2000 ఎస్కేయూలు అందుబాటులో ఉండగా, అనుబంధ సంస్థ ద్వారా 1,500 ఎస్కేయూలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తులను మూడు ప్రాధమిక వర్గాలుగా విభజించారు. మైల్డ్ స్టీల్ (తక్కువ కార్బన్ స్టీల్ వైరు), స్టెయిన్లెస్ స్టీల్ వైరు, అధిక కార్బన్ స్టీల్ తీగ.
నేడు బన్సల్ వైర్ ఐపీఓ జీఎంపీ (GMP) +66గా ఉంది. అంటే, గ్రే మార్కెట్లో బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.66 ప్రీమియం వద్ద ట్రేడవుతోందని అర్థం. గ్రే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ ధర ఐపీఓ ధర రూ.256 కంటే 25.78 శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది.
సూచన: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవే తప్ప హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.