Bank holidays: వచ్చే వారం.. బ్యాంక్​లకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు!-banks to remain closed for 3 days next week in these cities due to ganesh chaturthi 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays: వచ్చే వారం.. బ్యాంక్​లకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు!

Bank holidays: వచ్చే వారం.. బ్యాంక్​లకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు!

Sharath Chitturi HT Telugu

Bank holidays in September : వినాయక చవితి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంక్​లకు వచ్చే వారంలో 3 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఆ వివరాలు.

వచ్చే వారం.. బ్యాంక్​లకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు!

Bank holidays in September : వినాయక చవితి వేడుకలకు భారత దేశం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా గణేశ్​ విగ్రహాలు.. మండపాల వద్దకు చేరుకుంటున్నాయి. గణేశ్​ చతుర్థి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. అయితే బ్యాంక్​లకు మాత్రం వచ్చే వారంలో.. వరుసగా 3 రోజుల పాటు సెలవులు లభిస్తున్నాయి. ఆ వివరాలు..

3 రోజుల పాటు బ్యాంక్​ సెలవులు ఇలా..

కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితిని ఈ నెల 18న జరుపుకుంటున్నారు. కొన్ని చోట్ల 19న చేసుకుంటున్నారు. ఆర్​బీఐ హాలీడే క్యాలెండర్​ ప్రకారం..

Bank holidays next week : సెప్టెంబర్​ 18:- హైదరాబాద్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, బెంగళూరు, చెన్నైలోని బ్యాంక్​లకు సెలవు.

సెప్టెంబర్​ 19:- ముంబై, నాగ్​పూర్​, పనాజీ, అహ్మదాబాద్​, బేలాపూర్​, భువనేశ్వర్​లోని బ్యాంక్​లకు సెలవు.

సెప్టెంబర్​ 20:- వినాయక చవితి రెండ రోజు/ నౌఖై నేపథ్యంలో భువనేశ్వర్​, పనాజీలోని బ్యాంక్​లకు సెలవు.

ఇక ఆదివారాన్ని కూడా కలుపుకుంటే.. బ్యాంక్​లకు 17-20 మధ్యలో నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నట్టే!

సెప్టెంబర్​లోని ఇతర బ్యాంక్​ సెలవుల వివరాలు..

సెప్టెంబర్​ 22:- శ్రీ నారాయణ గురు సమాధి డే. కేరళలో బ్యాంక్​లకు సెలవు.

Ganesh Chaturthi 2023 : సెప్టెంబర్​ 23:- మహారాజ హరి సింగ్​ జయంతి. జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

సెప్టెంబర్​ 25:- శ్రీమంత శంకరదేవ జయంతి. అసోంలో బ్యాంక్​లకు సెలవు

సెప్టెంబర్​ 27:- మిలాద్​-ఇ- షెరిఫ్​. జమ్ముకశ్మీర్​, కేరళలోని బ్యాంక్​లకు సెలవు.

సెప్టెంబర్​ 8:- ఈద్​-ఇ-మిలాద్​. గుజరాత్​, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్​, తెలంగాణ, మణిపూర్​, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​లోని బ్యాంక్​లకు సెలవు.

మొత్తం మీద ఈ సెప్టెంబర్​లో బ్యాంక్​లకు 16 రోజుల పాటు హాలీడే లభించనుంది.

Bank holidays list September 2023 Telugu : బ్యాంక్​ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్​ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత తమ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు.

మొబైల్​ బ్యాంకింగ్​ సేవలు..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

సంబంధిత కథనం