Bank charges: చార్జీల పేరుతో మన నుంచి బ్యాంకులు వసూలు చేసిన మొత్తమెంతో తెలుసా?
Bank charges: భారత్ లోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ చార్జెస్, ఎస్ఎంఎస్ చార్జెస్ మొదలైన రుసుముల ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం దాదాపు 35 వేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ప్రభుత్వం గురువారం రాజ్య సభలో వెల్లడించింది.
Bank charges: భారత్ లోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ చార్జెస్, ఎస్ఎంఎస్ చార్జెస్ మొదలైన రుసుముల ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం దాదాపు 35 వేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ప్రభుత్వం గురువారం రాజ్య సభలో వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
రకరకాల చార్జీలు..
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగంలోని ఐదు ప్రధాన బ్యాంకులు 2018 నుంచి 2023 మార్చి వరకు రూ. 35 వేల కోట్లకు పైగా వినియోగదారుల నుంచి చార్జీల పేరుతో వసూలు చేశాయి. కనీస మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో నిలువ ఉంచకపోవడం (non-maintenance of minimum balance), ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను మించి ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఆ చార్జెస్, ఎస్ఎంఎస్ సర్వీసెస్, ఇతర ట్రాన్సాక్షన్ సర్వీసెస్.. ఇవన్నీ ఆ రుసుముల్లో వస్తాయి. ఇందులో మినిమం బ్యాలెన్స్ ఖాతాలో లేకపోవడం వల్ల విధించిన చార్జీల ద్వారా రూ. 21 వేల కోట్లు ఆయా బ్యాంకులు వసూలు చేశాయి. అదనపు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చార్జ్ ద్వారా రూ. 8 వేల కోట్లను, ఎస్ఎంఎస్ సర్వీస్ చార్జీల ద్వారా రూ. 6 వేల కోట్లను బ్యాంకులు సంపాదించాయి.
ఇదీ ఆదాయమే..
బ్యాంకులకు వినియోగదారులపై విధించే వివిధ రకాల రుసుముల ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. కనీస మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో నిలువ ఉంచకపోవడం (non-maintenance of minimum balance), ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను మించి ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఆ చార్జెస్, ఎస్ఎంఎస్ సర్వీసెస్, ఇతర ట్రాన్సాక్షన్ సర్వీసెస్, క్యాష్ డిపాజిట్ లిమిట్ మించితే విధించే చార్జ్, బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్ లో కాకుండా, వేరే బ్రాంచ్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తే విధించే చార్జ్.. ఇలా వివిధ రకాలుగా వినియోగదారుల నుంచి బ్యాంకులు రుసుములను వసూలు చేస్తాయి. బ్యాంక్ ఖాతాలో కనీస మొత్తం ఎంత ఉండాలనేదది ఆ బ్యాంకే నిర్ణయిస్తుంది. సాధారణంగా మెట్రో నగరాల్లో రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 నుంచి రూ. 1000 వరకు కనీస మొత్తం ఉండాలని బ్యాంకులు నిర్దేశిస్తాయి.