Bank Holidays List 2025 : 2025లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఏ నెలలో ఎక్కువ ఉన్నాయి?
Bank Holidays List 2025 : 2025 సంవత్సరంలోకి వచ్చేశాం. అయితే ఈ ఏడాది బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఆ లిస్టు చూద్దాం..
ఈ సంవత్సరం బ్యాంకులకు ఎన్ని సెలవు రోజులు అందుబాటులో ఉంటాయో భారతీయ రిజర్వ్ బ్యాంక్ షేర్ చేసింది. రాష్ట్రాల వారీగా బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడతాయనే జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ప్రాంతీయ పండుగల కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి. కొత్త సంవత్సరం 2025లో రెండో శనివారాలు, ఆదివారాలు మినహా దేశవ్యాప్తంగా చాలా రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు ఉంటాయి.
జనవరి నెలలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి జనవరి 1 సెలవు దినంగా ఉంది. జనవరి 2న కూడా సెలవు ఉంటుంది. జనవరి నెలలో 6, 11, 14, 15, 16, 23 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా రెండో శనివారం, ఆధివారం కూడా సెలవులు ఉంటాయి.
2025 ఫిబ్రవరిలో శని, ఆదివారాలు మినహా మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో 3, 11, 12, 15, 19, 20, 26, 28 తేదీల్లో సెలవులు ఉంటాయి.
మార్చిలో శని, ఆదివారాలు మినహా మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి నెలలో 7, 13, 14, 15, 22, 27, 28, 31 తేదీల్లో సెలవులు ఉంటాయి.
ఏప్రిల్‌లో శని మరియు ఆదివారాలు మినహా మొత్తం 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఏప్రిల్ 1, 5, 10, 14, 15, 16, 18, 21, 29, 30 తేదీల్లో ఉంటాయి.
ఈ ఏడాది మేలో బ్యాంకులకు సెలవులు మే 1, 9, 12, 16, 26, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి.
జులైలో శని, ఆదివారాలు మినహా మొత్తం 6 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. జూలైలో బ్యాంకులకు సెలవులు 3, 5, 14, 17, 19, 28వ తేదీల్లో ఉన్నాయి.
ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు 8, 9, 13, 15, 16, 19, 25, 27, 28 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉంటాయి.
శని, ఆదివారాలు మినహా మొత్తం 9 రోజుల పాటు సెప్టెంబర్‌లో బ్యాంకులకు హాలిడేస్. సెప్టెంబర్ 3, 4, 5, 6, 12, 22, 23, 29, 30 తేదీలలో సెలవులు ఉన్నాయి.
అక్టోబర్‌లో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తాయి. 1, 2, 3, 4, 6, 7, 10, 18, 20, 21, 22, 23, 27, 28, 31 తేదీల్లో సెలవులు ఉంటాయి.
నవంబర్‌లో శని, ఆదివారాలు మినహా మొత్తం 4 రోజుల పాటు బ్యాంకు సెలవులు ఉన్నాయి. నవంబర్ నెలలో 1, 5, 7, 8 తేదీల్లో సెలవులు ఉంటాయి.
డిసెంబర్‌లో శని, ఆదివారాలు మినహా 13 రోజులు సెలవులు వస్తాయి. డిసెంబరు 1, 3, 12, 18, 19, 20, 22, 24, 25, 26, 27, 30, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
గమనిక : పలు రాష్ట్రాల ప్రాంతీయ పండుగల కారణంగా ఆయా ప్రాంతాల్లో సెలవులు ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో తెరిచే ఉంటాయి.