Bank holidays : అలర్ట్- ఈ వారం బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..
Bank holidays in November : బ్యాంకు పనుల కోసం వెళ్లే వారికి ముఖ్యమైన అలర్ట్! ఈ వారం బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు లభించనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నవంబర్ 2024 లో మతపరమైన పండుగలు, ప్రాంతీయ వేడుకలు, వారాంతాలు, ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 సెలవులు లభించనున్నాయి. అయితే ఈ వారంలో పలు రాష్ట్రాల్లోని బ్యాంకులు లాంగ్ వీకెండ్ హాలీడేలో ఉండనున్నాయి. ఛత్ పూజ (నవంబర్ 7 మరియు 8), రెండొవ శనివారం (నవంబర్ 9), ఆదివారం (నవంబర్ 10) కారణంగా బ్యాంకులకు 4 రోజుల పాటు సెలవులు లభించాయి.
బీహార్, దిల్లీ, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నవంబర్ 7న ఛత్ పూజ సెలవులు ప్రకటించారు. నవంబర్ 8న బీహార్, ఝార్ఖండ్, మేఘాలయలో ఛత్ సంబంధిత వేడుకల కోసం బ్యాంకులు మూతపడి ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు నెలలోని ప్రతి రెండొవ, నాల్గొవ శనివారం సెలవుదినం. అంటే నవంబర్ 9 కూడా బ్యాంకులకు సెలువు. ఇక ఆదివారం ఎలాగూ సెలవు దినమే.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఛత్ పూజకు సంబంధించిన సెలవులు ఉండవు. ఫలితంగా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు 7,8 తేదీలు పనిచేస్తాయి. కానీ 9,10 తేదీల్లో సెలవులో ఉంటాయి.
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్స్‌ని నిర్వహిస్తాయని గుర్తుపెట్టుకోవాలి.
2024 నవంబర్ బ్యాంకులకు సెలవులు..
- నవంబర్ 3 (ఆదివారం): అన్ని భారతీయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 7 (గురువారం): ఛత్ (సాయంత్రం అర్ఘ్య) సందర్భంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 8 (శుక్రవారం): ఛత్ (మార్నింగ్ అర్ఘ్య)/ వంగలా ఫెస్టివల్ సందర్భంగా బీహార్, జార్ఖండ్, మేఘాలయ వంటి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 9 (శనివారం): రెండో శనివారం.
- నవంబర్ 10 (ఆదివారం): ఆదివారం.
- నవంబర్ 15 (శుక్రవారం): గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ/ రహస్య పూర్ణిమ సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్-తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- నవంబర్ 17 (ఆదివారం): ఆదివారం.
- నవంబర్ 18 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో అన్ని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 23 (శనివారం): మేఘాలయలో సెంగ్ కుట్స్నెమ్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే, నవంబర్ 23 నాలుగో శనివారం.
- నవంబర్ 24 (ఆదివారం): ఆదివారం
ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ- స్థానిక సందర్భాలు, కార్యాచరణ అవసరాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా బ్యాంకులు- ఇతర ఆర్థిక సంస్థలకు సెలవుల ప్రకటన చేస్తుంది.
సంబంధిత కథనం