Bank holidays in march : అలర్ట్​! 2025 మార్చ్​లో బ్యాంక్​లకు ఎన్ని సెలవులు అంటే..-bank holidays in march 2025 check full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In March : అలర్ట్​! 2025 మార్చ్​లో బ్యాంక్​లకు ఎన్ని సెలవులు అంటే..

Bank holidays in march : అలర్ట్​! 2025 మార్చ్​లో బ్యాంక్​లకు ఎన్ని సెలవులు అంటే..

Sharath Chitturi HT Telugu

Bank holidays in march : 2025 మార్చ్​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ వచ్చేసింది. వచ్చే నెలలో బ్యాంక్​లు ఎన్ని రోజులు మూతపడి ఉంటాయంటే..

మార్చ్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​.. (REUTERS)

ఈ వారంతో 2025 ఏడాది రెండో నెలకు ముగింపు పడనుంది. ఇక ఫిబ్రవరి నెలలో సగం రోజులు సెలవులు తీసుకున్న బ్యాంక్​లకు మార్చ్​లోనూ హాలీడేలు బాగానే ఉన్నాయి. ఈ మేరకు ఆర్​బీఐ తాజాగా సెలవుల లిస్ట్​ని రిలీజ్​ చేసింది. బ్యాంక్​ పనుల మీద తిరిగే వారు ఈ 2025 మార్చ్​ బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తవుతాయి. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

మార్చ్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​..

మార్చ్​ 1 శనివారం- రామకృష్ణ జయంతి, పశ్చిమ్​ బెంగాల్​, ఒడిశా, అసోంలో బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 13 గురువారం- ఛొటి హోలీ, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 14 శుక్రవారం- హోలీ, దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 20 గురువారం- పార్సీ నూతన ఏడాది, మహారాష్ట్ర- గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు.

వారంతపు సెలవులు ఇలా..

మార్చ్​ 2- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 8- రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 9- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 16- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 22- నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 23- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

మార్చ్​ 30- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

ఇదే మార్చ్​ 30న ఉగాది కూడా వచ్చింది! తెలంగాణ, ఏపీల్లో నిర్వహించే ఈ పండుగకు సెలవు ఉండాల్సింది. కానీ ఆదివారం కాబట్టి ఎలాగో సెలవు ఉంటుంది.

ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు..

నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్​లైన్ వెబ్​సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ద్వారా అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంనైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్​ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.

ఏది ఏమైనా 2025 మార్చ్​ బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని చూసి అందుకు తగ్గట్టుగా బ్యాంక్​ కార్యక్రమాలు ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం