2024 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. 2025 అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో 2025 జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ని వెల్లడించింది. పండుగ, ప్రాంతీయ సెలవులు కలుపుకుని 2025 జనవరిలో బ్యాంక్‌లకు మొత్తం 15 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
జనవరి 1- న్యూ ఇయర్, అన్ని బ్యాంక్‌లకు సెలవు.
జనవరి 2- మన్నమ్ జయంతి, కేరళలని బ్యాంక్‌లకు సెలవు.
జనవరి 5- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 6- గురు గోబింద్ సింగ్ జయంతి, హరియాణా- పంజాబ్‌లోని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 11- రెండో శనివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 12- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 14- మకర సంక్రాంతి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులోని అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 15- మకర సంక్రాంతి, తిరువల్లూర్ డే- తమిళనాడు, అసోంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సెలవు
జనవరి 16- ఉజ్జవర్ తిరునాళ్, తమిళనాడు బ్యాంక్‌లకు సెలవు
జనవరి 19- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 22- ఇమోయిన్, మణిపూర్‌లోని అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, మణిపూర్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, పశ్చిమ్ బెంగాల్, జమ్ముకశ్మీర్, దిల్లీలోని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 25- నాలుగో శనివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 26- రిపబ్లిక్ డే, ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
జనవరి 30- సోనమ్ లోసర్, సిక్కింలోని అన్ని బ్యాంక్‌లకు సెలవు.
భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి, హాలిడే షెడ్యూల్ లేదా జాబితా కోసం మీ స్థానిక బ్యాంక్ శాఖను సంప్రదించడం ఉత్తమమని కస్టమర్లు గమనించాలి.
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంలను అయినా యాక్సెస్ చేయవచ్చు.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.
ఏది ఏమైనా 2025 జనవరి బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని చూసి అందుకు తగ్గట్టుగా బ్యాంక్ కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!
సంబంధిత కథనం