Bank Holidays in February : ఫిబ్రవరిలో బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులు- ఫుల్ లిస్ట్ ఇదే..
Bank Holidays in February : ఫిబ్రవరి బ్యాంక్ సెలవుల లిస్ట్ వచ్చేసింది. బ్యాంక్ పనుల కోసం వెళ్లే వారికి ఈ లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ వారంతో 2025 ఏడాది మొదటి నెలకు ముగింపు పడనుంది. ఇక జనవరి నెలలో సగం రోజులు సెలవులు తీసుకున్న బ్యాంక్‌లకు ఫిబ్రవరిలోనూ 14 రోజుల పాటు హాలీడేలు దక్కనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా సెలవుల లిస్ట్‌ని విడుదల చేసింది. బ్యాంక్ పనుల మీద తిరిగే వారు ఈ 2025 ఫిబ్రవరి బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తవుతాయి. బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
2025 ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవుల లిస్ట్..
ఫిబ్రవరి 3- సరస్వతి పూజ, అగర్తలలోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 11- థై పోసమ్, చెన్నైలోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 12- శ్రీ రవిదాస్ జయంతి, శిమ్లాలోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 15- లుయ్ గై ని, ఇంఫాల్‌లోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజి మహరాజ్ జయంతి, బేలాపూర్, ముంబై, నగ్పూర్లోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 20- స్టేట్హుడ్ డే, ఐజ్వాల్- ఇటానగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 26- మహా శివరాత్రి. అహ్మదాబాద్, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, డెహ్రాడూన్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, శిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలోని బ్యాంక్‌లకు సెలవు.
ఫిబ్రవరి 28- లోసర్, గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలవు
వారాంతపు సెలవులు ఇలా..
ఫిబ్రవరి 2- ఆదివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 8- రెండో శనివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 9- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలువు
ఫిబ్రవరి 16- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 22- నాలుగో శనివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
ఫిబ్రవరి 23- ఆదివారం, అన్ని బ్యాంక్‌లకు సెలవు
ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి..
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధమే లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా అందుబాటులో ఉంటాయను గర్తుపెట్టుకోవాలి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంలనైనా యాక్సెస్ చేయవచ్చు.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.
ఏది ఏమైనా 2025 ఫిబ్రవరి బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని చూసి అందుకు తగ్గట్టుగా బ్యాంక్ కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!
సంబంధిత కథనం