Bank holidays in February 2023 : ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు-bank holidays in february 2023 check full list and details in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bank Holidays In February 2023 Check Full List And Details In Telugu

Bank holidays in February 2023 : ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 07:55 AM IST

Bank holidays in February 2023 : ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 10 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఆ లిస్ట్​ను ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు
ఫిబ్రవరిలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు (HT_PRINT)

List of Bank holidays in February 2023 : ఫిబ్రవరి నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో బ్యాంక్​ సెలవులకు సంబంధించిన లిస్ట్​ను ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్​ పనుల కోసం వెళ్లేవాళ్లు.. ఈ లిస్ట్​ను కచ్చితంగా చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్​కు వెళ్లాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఫిబ్రవరి 2023లో మొత్తం మీద బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..

2023 ఫిబ్రవరి బ్యాంక్​ సెలవులు..

ఫిబ్రవరి 15:- లుయి- న్​గాయ్​-ని, మణిపాల్​ రాష్ట్రంలోని బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 18:- మహా శివరాత్రి, త్రిపుర, మిజోరాం, ఛండీగఢ్​, తమిళనాడు, సిక్కిం, అసోం, మణిపూర్​, రాజస్థాన్​, పశ్చిమ్​ బంగాల్​, ఢిల్లీ, గోవా, బీహార్​, మేఘాలయ రాష్ట్రాలు మినహా.. ఇతర రాష్ట్రాల్లో బ్యాంక్​లకు సెలవు.

February 2023 Bank holidays : ఫిబ్రవరి 20:- మిజోరాం స్టేట్​ డే, మిజోరాం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 21:- లోసర్​, సిక్కింలో బ్యాంక్​ రాష్ట్రాలకు సెలవు

సాధారణ సెలవుల లిస్ట్​..

ఫిబ్రవరి 5:- ఆదివారం

February 2023 Bank holidays : ఫిబ్రవరి 11:- రెండో శనివారం

ఫిబ్రవరి 12:- ఆదివారం

ఫిబ్రవరి 19:- ఆదివారం

ఫిబ్రవరి 25:- నాలుగో శనివారం

ఫిబ్రవరి 26:- ఆదివారం

ఇక జనవరిలో బ్యాంక్​లు 11 రోజుల పాటు పనిచేయలేదు. వివిధ రాష్ట్రాల్లో పండుగలతో పాటు గణతంత్ర్య దినోత్సవం జనవరిలో రావడంతో.. బ్యాంక్​లు సెలవులు తీసుకున్నాయి.

బ్యాంక్​లు మూసి ఉన్నప్పటికీ.. ప్రజలు ఇంటర్​నెట్​ బ్యాంకింగ్​, మొబైల్​ బ్యాంకింగ్​ ద్వారా బ్యాంక్​ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే.. ఇందుకోసం మీకు యాక్టివ్​ నెట్​ బ్యాంకింగ్​, మొబైల్​ బ్యాంకింగ్​ సేవలు ఉండాలి. లాగిన్​ డీటైల్స్​ ఉండాలి.

ఈ ఏడాది బ్యాంక్​ సెలవులు..

Bank Holidays in 2023 : 2023 ఫిబ్రవరిలోని బ్యాంక్​ సెలవుల వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మిగిలిన నెలలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ను ఓసారి చూద్దాం..

మార్చ్​:-

మార్చ్​ 8:- బుధవారం, హోలీ

2023 Bank Holidays : మార్చ్​ 22:- బుధవారం, ఉగాది

మార్చ్​ 30:- గురువారం, శ్రీ రామ నవమి

ఏప్రిల్​:-

ఏప్రిల్​ 4:- మంగళవారం, మహావీర్​ జయంతి

ఏప్రిల్​ 7:- శుక్రవారం, గుడ్​ ఫ్రైడే

ఏప్రిల్​ 14:- శుక్రవారం, డా. అంబేడ్కర్​ జయంతి

ఏప్రిల్​ 22:- శనివారం, ఈదుల్​ ఫితర్​

మే:-

మే 1:- సోమవారం, లేబర్​ డే

Bank holidays in February 2023 : మే 5:- శుక్రవారం, బుద్ధ పౌర్ణమి

జూన్​- జులై:-

జూన్​ 29:- గురువారం, బక్రీద్​

జులై 29:- శనివారం, ముహర్రం

ఆగస్ట్​:-

ఆగస్ట్​ 15:- మంగళవారం, స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్ట్​ 16:- బుధవారం, పార్సీ న్యూ ఇయర్​

Bank Holidays 2023 Hyderabad : ఆగస్ట్​ 31:- గురువారం, రక్షా బంధన్​

సెప్టెంబర్​:-

సెప్టెంబర్​ 7:- గురువారం, జన్మాష్టమి

సెప్టెంబర్​ 19:- మంగళవారం, వినాయక చవితి

2023 బ్యాంక్​ సెలవులకు సంబంధించిన పూర్తి లిస్ట్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం