తెలంగాణ, ఆంధ్రలో కస్టమర్స్​కి అలర్ట్​- బక్రీద్​కు బ్యాంకు సెలవు ఉందా? లేదా?-bank holiday today on bakrid are banks open or closed on june 7 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  తెలంగాణ, ఆంధ్రలో కస్టమర్స్​కి అలర్ట్​- బక్రీద్​కు బ్యాంకు సెలవు ఉందా? లేదా?

తెలంగాణ, ఆంధ్రలో కస్టమర్స్​కి అలర్ట్​- బక్రీద్​కు బ్యాంకు సెలవు ఉందా? లేదా?

Sharath Chitturi HT Telugu

బక్రీద్ 2025 బ్యాంక్ సెలవు: భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 2025 జూన్ 7 న బక్రీద్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. అసౌకర్యాన్ని నివారించడానికి ఖాతాదారులు తమ బ్యాంకుతో స్థానిక సెలవు షెడ్యూల్లను ధృవీకరించాలి.

ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా?

బ్యాంకు కస్టమర్స్​కి అలర్ట్​! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025 జూన్ 7, శనివారం బక్రీద్ కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సాధారణంగా ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో బ్యాంకులు తెరిచి ఉండగా, రెండు- నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. కాగా జూన్ 7 అనేది ఈ నెలలో మొదటి శనివారం. కాబట్టి బక్రీద్​కు ఆర్బీఐ సెలవు ప్రకటించని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయని గమనించాలి.

ఈద్ అల్-అధా అని కూడా పిలిచే బక్రీద్.. ఇస్లాంను అనుసరించేవారికి రెండొవ పవిత్రమైన పండుగ. ఈ ఏడాది భారతదేశంలో జూన్ 7 శనివారం జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన పండుగ ఇస్లాంలో చాలా ముఖ్యమైనది. ఇది ఇస్లామిక్ మూన్​ క్యాలెండర్ పన్నెండొవ, చివరి నెల అయిన ధూల్ హిజ్జా 10వ రోజున వస్తుంది.

బక్రీద్ 2025 బ్యాంకు సెలవులు - ప్రాంతాల వారీగా హాలీడే లిస్ట్​..

అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ - తెలంగాణ, ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్​కతా, లక్నో, ముంబై, నాగ్​పూర్, దిల్లీ, పనాజీ, పట్నా, రాయ్​పూర్, రాంచీ, షిల్లాంగ్లలో బ్యాంకులకు సెలవు.

కాగా అహ్మదాబాద్, గ్యాంగ్​టక్, ఇటానగర్​లో జూన్ 7, 2025 శనివారం బ్యాంకులు పనిచేస్తాయి.

మరోవైపు రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు. వారాంతాలతో పాటు, నివాస స్థితిని బట్టి జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాల కోసం బ్యాంకులు మూతపడి ఉంటాయి. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. కాబట్టి సందర్శనను ప్లాన్ చేయడానికి ముందు స్థానిక బ్యాంక్ శాఖతో సెలవుల జాబితాను ధృవీకరించడం మంచిది.

రాబోయే బ్యాంకు సెలవులు..

2025 జూన్​లో వారాంతాలు బక్రీద్ సహా బ్యాంకులకు మొత్తం నాలుగు రోజులు సెలవులు ఉంటాయి.

జూన్ 11 (బుధవారం) - సంత్ గురు కబీర్ జయంతి / సాగా దవా - సిక్కిం. హిమాచల్ ప్రదేశ్​లో బ్యాంకులకు సెలవు.

జూన్ 27 (శుక్రవారం) - రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్​లో బ్యాంకులకు సెలవు.

జూన్ 30 (సోమవారం) - రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం