రూ .2 లక్షలలోపు ధరలో సూపర్ బైక్స్.. మీ కోసం ఇక్కడ 5 ఆప్షన్స్-bajaj pulsar ns400z to hero xtreme 250r 5 great options of powerful bikes check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ .2 లక్షలలోపు ధరలో సూపర్ బైక్స్.. మీ కోసం ఇక్కడ 5 ఆప్షన్స్

రూ .2 లక్షలలోపు ధరలో సూపర్ బైక్స్.. మీ కోసం ఇక్కడ 5 ఆప్షన్స్

Anand Sai HT Telugu

త్వరలో మీరు బడ్జెట్ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ మోటర్ సైకిళ్లు కొనాలని చూస్తున్నారా? వీటికి ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. మీరు కూడా కొనాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్

ారతీయ కస్టమర్లలో పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ కోసం చూస్తే.. మీ కోసం ఆప్షన్స్ ఉన్నాయి. మీ రోజువారీ పనితోపాటుగా వీకెండ్ బాగా ఎంజాయ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇండియన్ మార్కెట్లో రూ.2 లక్షల లోపు ధర కలిగిన 5 సూపర్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్200 4వీ

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్200 4వీ కూడా రూ.2 లక్షల లోపు సెగ్మెంట్లో మంచి ఆప్షన్. ఈ మోటార్ సైకిల్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ సస్పెన్షన్, మూడు రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ మోడ్, అడ్జస్టబుల్ బ్రేక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.50 లక్షలు. ఈ బైక్ 197.75 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. గరిష్టంగా 20.54 బీహెచ్పీ శక్తిని, 17.25 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఆర్15 వి4

యమహా ఆర్15 తాజా వి4 వెర్షన్ కూడా ఈ విభాగంలో గొప్ప ఆప్షన్. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.84 లక్షలు. ఈ మోటార్ సైకిల్ 155సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 18.1 బీహెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 400జెడ్

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 400జెడ్ ఈ సెగ్మెంట్‌లో ఒక గొప్ప ఎంపిక. ఇండియన్ మార్కెట్లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.85 లక్షలు. ఇందులోని 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 40బీహెచ్‌పీ పవర్, 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్‌లో ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడింగ్ మోడ్స్, స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.

హీరో ఎక్స్ పల్స్ 210

హీరో ఎక్స్ పల్స్ 210 మీకు ఉత్తమమైన మోటార్ సైకిల్. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .1.76 లక్షల నుండి రూ .1.86 లక్షల మధ్య ఉంది. ఈ బైక్ 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 24.2 బీహెచ్‌పీ శక్తిని, 20.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ పల్స్ 210లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్, ఏబీఎస్ మోడ్స్, ఆల్‌ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్

హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్ 250సీసీ సెగ్మెంట్‌లో సరికొత్త ఎంట్రీ. ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.80 లక్షలు. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 30 బీహెచ్‌పీ పవర్, 25 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.