Bajaj Finserv Gold Loan: తక్కువ వడ్డీకే 2 కోట్ల వరకు గోల్డ్ లోన్-bajaj finserv now offers gold loan up to rs 2 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bajaj Finserv Now Offers Gold Loan Up To Rs. 2 Crore

Bajaj Finserv Gold Loan: తక్కువ వడ్డీకే 2 కోట్ల వరకు గోల్డ్ లోన్

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 03:59 PM IST

Bajaj Finserv Gold Loan: అర్హత కలిగిన అందరికీ రూ. 2 కోట్ల వరకు బంగారంపై రుణాలు ఇస్తామని బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv) ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తక్కువ సమయంలో, తక్కువ డాక్యుమెంటేషన్ తో రుణం పొందాలంటే బెస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్ (Gold Loan). తాజాగా, తమ గోల్డ్ లోన పరిమితిని రూ. 2 కోట్ల వరకు పెంచామని బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv) తెలిపింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

Bajaj Finserv Gold Loan: రూ. 5 వేల నుంచి..

అర్హత కలిగిన వ్యక్తులకు తక్కువ వడ్డీకే బంగారంపై రూ. 5 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు రుణాలు (Gold Loan) ఇస్తామని బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv) తెలిపింది. ఈ రుణాలపై నెలకు 0.83% వడ్డీ మాత్రమే ఉంటుందని వెల్లడించింది. 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారంపై రుణాలు ఇస్తామని ప్రకటించింది. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv)లో బంగారం పై అప్పు తీసుకోవడం చాలా సులువని తెలిపింది. 21 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న భారతీయ పౌరులెవరైనా ఈ రుణం పొందడానికి అర్హులని తెలిపింది. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv) వద్ద బంగారంపై రుణం తీసుకున్నవారికి మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి పార్ట్ రిలీజ్ ఫెసిలిటీ (Part-release facility). అంటే రుణం తీసుకున్న తరువాత, కొంత కాలానికి అందులో కొంత మొత్తాన్ని చెల్లించి, దానికి సమానమైన బంగారాన్ని వెనక్కు తీసుకోవచ్చు.

Bajaj Finserv Gold Loan: ఆన్ లైన్ కాలిక్యులేటర్

రీ పేమెంట్ ఆప్షన్స్ ను కూడా కస్టమర్లకు అనువైన రీతిలో నిర్ణయించుకోవచ్చు. తాము తీసుకున్న రుణం (Gold Loan) పై వడ్డీని నెలకు ఒకసారి కానీ, మూడు నెలలకు ఒకసారి కానీ, మూడు నెలలకు ఒకసారి కానీ, ఆరు నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ చెల్లించవచ్చు. అలాగే, ఎలాంటి చార్జీలు లేకుండా, ముందుగానే మొత్తం రుణాన్ని కానీ, రుణంలో కొంత భాగాన్ని కానీ చెల్లించవచ్చు. అలాగే, తమ వద్ద ఉన్న బంగారానికి ఎంత మొత్తం రుణం (Gold Loan) గా లభిస్తుందనే విషయాన్ని కస్టమర్లు ఆన్ లైన్ లోనే బజాజ్ ఫిన్ సర్వ్ వెబ్ సైట్ లోని Online gold loan calculator, online gold loan EMI calculator ల ద్వారా ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు. బంగారం విలువను లెక్కించే పద్దతి కూడా బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Bajaj Finserv) లో పారదర్శకంగా ఉంటుందని సంస్థ తెలిపింది.

WhatsApp channel